
శ్రీ పరాభవ నామ సంవత్సరం తులా రాశి , చిత్త 3,4, స్వాతి , విశాఖ 1,2,3 పాదాలు, వీరి దాయ వ్యయాల విషయాలకు వస్తే, ఆదాయం 5, వ్యయం 14. రాజ పూజ్యం 6, అవమానం 3. ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండనుంది. వీరు పట్టింది బంగారమే అవుతుంది. అన్నింట్లో విజయ పతాకం ఎగరవేస్తారు. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఎవరు అయితే కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలని చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారో, వారి కోరిక నెరవేరుతుంది.

తుల రావి వారికి కుజుడు అష్టమ స్థానంలో రాహువు అర్థాష్టమంలో, గురుడు 9,10వ స్థానాల్లో సంచారం చేయడం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. చాలా మంది మీపై చెడుగా చెప్పడం, నిందలు వేయడం జరుగుతుంది. కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం తలా రాశి ఉద్యోగులకు కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకునే వారి కోరిక నెరవేరనుంది. విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంది. వీరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు . మంచి ర్యాంకులతో పెద్ద పెద్ద కాలేజీల్లో సీటు సంపాదించే ఛాన్స్ ఉంది. కానీ విశాఖ 1,2,3 పాదాల వారు మాత్రమే ఎక్కువ కష్టపడితే, ప్రతిఫలం పొందుతారు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం తుల రాశి వారికి చాలా అనుకూలంగా, యోగ దాయకంగా ఉంది. మీ తెలివి తేటలే, మీకు మంచి గుర్తింపు తీసుకొస్తాయి. కానీ మీరు మీ ప్రణాళికల గురించి ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు తెలియజేయకూడదు. దీని వలన పనుల్లో ఆటంకాలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ రాశి స్త్రీల మాటకు ఎదురు ఉండు, గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన, కుటుంబంలో ఆనందం, సంతోషం నెలకుంటుంది. వీరు చాలా ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతారు.

తుల రాశి రాజకీయ నాయకులకు ఇది చాలా అద్భుతమై సమయం అని చెప్పాలి. వీరికి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది. ఎన్నికల్లో పోటీచేసి విజయం అందుకుంటారు. తప్పకుండా ఏదో ఒక పదవిలో ఉండటం ఖాయం. అలాగే వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకొని చాలా సంతోషంగా ఉంటారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా కలిసి వస్తుంది.