Sorakaya Fry: చాలా తక్కువ మందికి తెలిసిన ఘుమఘుమలాడే సొరకాయ వేపుడు

Updated on: Sep 09, 2026 | 7:17 PM

సొరకాయ శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. ఇందులో అధికంగా ఉండే నీటి శాతం, పీచు పదార్థాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే ఎప్పుడూ రొటీన్‌గా సొరకాయ పాలు పోసి వండటమో, లేదా పప్పులో వేయడమో చేస్తే పిల్లలు అంతగా ఇష్టపడరు. పాతకాలపు పల్లెటూరి పద్ధతిలో సొరకాయ ముక్కలకు ముందుగానే ఉప్పు, పసుపు, కారం, నూనె మరియు వెల్లుల్లి రెబ్బలు పట్టించి మ్యారినేట్ చేసి, ఆ తర్వాత ప్రత్యేకమైన కందిపప్పు-మెంతుల పోపులో మగ్గిస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది.

1 / 5
ధనియాల పొడి, గరం మసాలాలు వంటి కృత్రిమ పొడులు ఏమీ వాడకుండా ఎంతో సింపుల్‌గా వేడివేడి అన్నం లేదా చపాతీల్లోకి సరిపోయే ఈ కమ్మని సొరకాయ వేపుడు తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

2 / 5
కావలసిన పదార్థాలు:  మీడియం సైజు ముక్కలుగా తరిగిన లేత సొరకాయ ఒకటి, ఒక స్పూన్ కారం పొడి, v పసుపు, రుచికి సరిపడా ఉప్పు,  0 నుండి 15వెల్లుల్లి రెబ్బలు , తగినంత నూనె, 4 నుండి 5 లవంగాలు, అంగుళం ముక్క దాల్చిన చెక్క, క స్పూన్ కందిపప్పు, పావు స్పూన్ మెంతులు, ఆవాలు,  అర స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి లేదా పండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు మరియు ఒక పెద్ద కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ.

3 / 5
సీక్రెట్ స్టెప్స్ తో ముక్కలను మ్యారినేట్ చేసే విధానం: ముందుగా లేత సొరకాయను తీసుకుని పీలర్‌తో పొట్టు తీయాలి. గింజలు లేతగా ఉంటే అలాగే ఉంచి, కాస్త పెద్ద సైజు ముక్కలుగా తరగాలి. ఒక ప్లేట్‌లో తరిగిన ముక్కలను తీసుకుని అందులో చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు మరియు ఒక స్పూన్ నూనె వేయాలి. ఈ మసాలాలు, వెల్లుల్లి ఫ్లేవర్ సొరకాయ ముక్కలకు బాగా పట్టేలా చేత్తో కలిపి 10 నుండి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల వెల్లుల్లి సువాసన ముక్కల లోపలి వరకు ఇంకుతుంది.

4 / 5
స్టవ్ వెలిగించి బాండీ పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కందిపప్పు, పావు స్పూన్ మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు మరియు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు చిన్న మంటపై వేయించాలి.

5 / 5
ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసి పోపులో బాగా కలపాలి. మూతపెట్టి సిమ్ ఫ్లేమ్‌లో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఒక చిన్న గరిటెడు నీళ్లు మాత్రమే చిలకరించి, నీరంతా ఇంకిపోయి ముక్క మెత్తబడి చక్కగా వేగే వరకు మరో రెండు మూడు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఘుమఘుమలాడే పల్లెటూరి స్టైల్ సొరకాయ వేపుడు సిద్ధం! వేడివేడి అన్నంలో కలుపుకుని తిన్నా, లేదా పుల్కా, చపాతీలతో తిన్నా ఒక్క ముక్క కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తారు!

Loading...
Unable to load recommendations.
Follow Us