
మందార మొక్కలు ఎక్కువగా పూయాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి.. మందార మొక్కలకు బియ్యం కడిగిన నీళ్ళను పోస్తే పూలు బాగా పూస్తాయి. మీరు అన్నం వండేటప్పుడు ఈ సారి ఆ నీళ్ళను బయట పారేయకండి. ఆ నీళ్ళను మందార మొక్కకు పోస్తే మొగ్గలు వస్తాయి

ఇంకా టీ పొడి, అరటి తొక్కలు, ఎరువులు వేయడం వల్ల ఈ మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయి. ఆ తర్వాత, మొక్కకు విపరీతంగా పూలు పూస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

కొమ్మలు కత్తిరిస్తూ ఉండాలి: మొక్కకు కొత్త కొమ్మలు రావాలంటే ఎండిన కొమ్మలను కత్తిరించాలి. ఇలా చేస్తే మొక్కలకు బాగా పూలు పూస్తాయి.అలాగే, కొమ్మల చివర్లో మొగ్గలు వస్తాయి

మందార మొక్కలకు ఎండ తగులుతూ ఉండాలి. అలాగే, వీటికి 6 నుంచి 7 గంటల పాటు సూర్యరశ్మి చాలా అవసరం. ఈ మొక్కల మీద ఎంత ఎక్కువ ఎండ పడితే అంత బాగా గుత్తులు గుత్తుల పూలు పూస్తాయి.

మందారం మొక్క దగ్గర ఎప్పుడూ కూడా తేమగా ఉండాలి అలాగే, నీరు ఎక్కువగా నిల్వ ఉంచకూడదు. ఇలా చేస్తే పూసిన మొగ్గలు మొత్తం రాలిపోతాయి.