నోటికి రుచిగా.. పొట్టకు హాయిగా.. కమ్మనైన వంకాయ పెరుగు పచ్చడి.. ఒక్కసారి ట్రై చేయండి

Updated on: Oct 26, 2026 | 5:52 PM

వేడి వాతావరణంలో లేదా మధ్యాహ్నం భోజనంలో మసాలా కూరలు తిని బోర్ కొట్టినప్పుడు.. కడుపును చల్లబరుస్తూ నాలికకు కొత్త రుచినిచ్చే అద్భుతమైన కంఫర్ట్ ఫుడ్ 'వంకాయ పెరుగు పచ్చడి'. ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ సినీ నటి శృతిహాసన్ సైతం తనకు ఈ వంకాయ పెరుగు కాంబినేషన్ అంటే ఎంతో ఇష్టమని, ఎంతో సాంత్వననిచ్చే ఆహారమని వెల్లడించారు. సాధారణంగా వంకాయతో కాల్చి చేసే పచ్చిపులుసు లేదా రోటి పచ్చడి చేస్తుంటారు; కానీ వంకాయలను గుండ్రటి చక్రాల్లా తరిగి, పెనంపై తక్కువ నూనెతో క్రిస్పీగా వేయించి కమ్మటి పెరుగు తాలింపుతో కలిపి చేస్తే దీని రుచి అమోఘంగా ఉంటుంది.

1 / 5
కావలసిన పదార్థాలు: పావు కిలో గుత్తి వంకాయలు, 2 కప్పుల చిక్కటి తాజా పెరుగు, 1 పెద్ద సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, 2 తుంచిన ఎండు మిరపకాయలు, 4 నుండి 5 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు, అర టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ జీలకర్ర, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు, 2 టేబుల్ స్పూన్ల వంట నూనె, వంకాయ ముక్కల మ్యారినేషన్ కోసం: పావు టీస్పూన్ సాల్ట్, అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ కారం పొడి, అర టీస్పూన్ ధనియాల పొడి, తాలింపు మసాలా కోసం: పసుపు – పావు టీస్పూన్, కారం – పావు టీస్పూన్, ఉప్పు – పావు టీస్పూన్

2 / 5
తయారీ విధానం:  పావు కిలో పెద్ద వంకాయను కడిగి.. మరీ లావుగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియం రౌండ్ స్లైసెస్‌లా కట్ చేసి నల్లబడకుండా ఉప్పు నీటిలో వేయాలి. ఒక ప్లేట్‌లో పావు టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ కారం, అర టీస్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఉప్పు నీటిలోంచి తీసిన వంకాయ చక్రాలకు ఈ పొడిని రెండు వైపులా సమంగా పట్టించి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

3 / 5
స్టవ్‌పై పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేయాలి. నూనె కాగాక అర టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముక్కలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్‌గా మారే వరకు మాత్రమే వేయించాలి మరీ ఎర్రగా వేయించకూడదు. ఇప్పుడు ఇందులో పావు టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ కారం, పావు టీస్పూన్ ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒక్క నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి వేరొక గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి.

4 / 5
అదే పాన్‌లో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి పాన్ అంతా స్ప్రెడ్ చేయాలి. నూనె కాగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయ చక్రాలను పాన్‌పై పేర్చి లో-మీడియం మంటపై కాల్చుకోవాలి. ఒక వైపు కాలిన తర్వాత నెమ్మదిగా రెండో వైపు తిప్పి రెండు వైపులా చక్కగా ఎర్రటి రోస్ట్ కలర్ వచ్చి మెత్తబడే వరకు వేయించి.. వెడల్పాటి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఒక గిన్నెలో 2 కప్పుల (అర లీటర్) తాజా పెరుగును వేసి విస్కర్ లేదా గరిటెతో ఉండలు లేకుండా నునుపుగా చిలకాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మరీ పల్చగా కాకుండా సరైన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇందులో వేయించి చల్లార్చుకున్న ఉల్లిపాయ తాలింపును (గార్నిషింగ్ కోసం కొద్దిగా పక్కన ఉంచి) వేసి బాగా కలపాలి. ఉప్పు సరిచూసుకోవాలి.

5 / 5
ఇప్పుడు ఈ తాలింపు పెరుగు మిశ్రమాన్ని.. ముందుగా బౌల్‌లో పేర్చి ఉంచుకున్న వేయించిన వంకాయ ముక్కలపై సమానంగా పోయాలి. పైనుంచి పక్కన తీసిపెట్టిన ఉల్లిపాయ తాలింపు, కొత్తిమీరతో అలంకరించుకోవాలి. అంతే, నోరూరించే శృతిహాసన్ ఫేవరెట్ 'వంకాయ పెరుగు పచ్చడి' సిద్ధం! వేడివేడి అన్నంలో ఈ పెరుగు వంకాయ వేసుకుని తింటుంటే పొట్టకు అమితమైన హాయినిస్తూ, చపాతీల్లోకి కూడా అద్భుతమైన కాంబినేషన్‌గా ఉండి అతిథులను సైతం మెప్పిస్తుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us