
చర్మ సమస్యలను తగ్గించుకునేందు చాలా మంది ఖరీదైన బ్యూటీ ప్రాడక్ట్స్ వాడి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ మన ఇంటి ఆవరణలోనే ఉండే వేపాకు ప్రాచీణ కాలం నుంచి చర్మ సౌందర్యంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. అవును వేపాకులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చి.. చర్మ నిగారింపును, సౌందర్యాన్ని పెంచడంలో ఎంతో సహాయపడుతాయి.

ఈ వేపలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు మన ముఖంపై ఏర్పడే మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అంతేకాదు చర్మంపై ఉన్న అధిక జిడ్డును తగ్గించడంతో పాటు మొటిమల వల్ల కలిగే వాపు, ఎరుపుదనాన్ని తగ్గిస్తాయి. అలాగే చర్మాన్ని అందంగా నిగారింపుగా మారుస్తాయి.

అంతేకాదు వేపాకుకు రక్తాన్ని శుద్ధి చేసే, చర్మం నుండి విషపదార్థాలను తొలగించే సామర్థ్యం ఉంది. వేపాకులతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ను క్రమం తప్పకుండా వాడితే చర్మంపై ఉన్న నల్ల మచ్చలు, నిర్జీవత్వాన్ని తొలగించి, చర్మానికి సహజమైన మెరుపు, కాంతిని అందిస్తుంది.

వేప ఆకులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలను తగ్గించడంలో సహాయపడుతాయి. దీని వల్ల మీ ముఖ్యం యవ్వనంగా మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. మీరు 40 ఏళ్లలో కూడా 20 ఏళ్ల వారిలా కనిపిస్తారు.

వేప ఆకు ఫేస్ ప్యాక్ తయారీ విధానం: వేపాకు ఫేస్ ప్యాక్ తయారు చేసుకునేందుకు ముందుగా కొన్ని పచ్చి వేప ఆకులను తీసుకొని మెత్తగా పేస్ట్‌లా నూరండి. ఇందులో కొద్దిగా పసుపు లేదా పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి. అలాగే వేపాకుతో మరిగించి చల్లార్చిన నీటితో ముఖం కడుక్కోవడం కూడా చాలా మంచిది. ఇలా వారంలో రెండు, మూడు రోజులు చేయడం వల్ల కచ్చితంగా మీరు మార్పును గమనిస్తారు.