
భారతదేశంలో ఖగోళ శాస్త్రం మరియు అంతరిక్ష శాస్త్రం గురించి నేర్చుకోవటానికి కృషి చేస్తున్న ఎస్‌టీఈఎం అండ్ స్పేస్ సంస్థ.. నాసా సిటిజన్ సైన్స్ ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ ఖగోళ శోధన సహకార సంస్థ (IASC)తో కలిసి ఖగోళ పరిశోధన చేపట్టారు.

ఈ ప్రాజెక్ట్ సమయంలో పిల్లలు ఆస్టరాయిడ్స్ మరియు నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్స్ (NEO) ను కనుగొనటానికి IASC ఆన్‌లైన్ శిక్షణ అందించారు. అత్యంత ప్రామాణికమైన ఖగోళ విషయాలను విద్యార్థులకు వివరించడం జరిగింది. తద్వారా భారతదేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఇది ఉపయుక్తం అయ్యింది.

అంగారక గ్రహం, బృహస్పతి మధ్య కక్ష్యలో ఉన్న ఆస్ట్రాయిడ్స్ భూమికి పెను సవాలుగా మారుతున్నాయి. అవి ఎప్పుడు కక్షను వీడి భూమి పైకి దూసుకు వస్తాయో తెలియదు.

ఈ ప్రాజెక్టులో విద్యార్థులు అధునాతన సాఫ్ట్‌వేర్ విశ్లేషణను ఉపయోగించారు. గ్రహశకలాలను కనిపెట్టేందుకు ప్రతి రోజు దాదాపు రెండు నుంచి మూడు గంటలు అధ్యయనం చేశారు. మొత్తం 372 ప్రాథమిక గ్రహశకలాల్లో చివరకు 18 గ్రహశకలాలను ధృవీకరించారు.

విద్యార్థులు కనిపెట్టిన ఈ గ్రహ శకలాలను అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్ యూనియన్ తాజాగా వీటిని గుర్తించింది.