Gas Saving: గ్యాస్ త్వరగా ఐపోతుందా.. ఈ సింపుల్ టిప్స్‌ పాటిస్తే.. వారం వచ్చేది 2 వారాలు రావడం పక్కా!

Updated on: Apr 01, 2026 | 4:45 PM

పశ్చిమాసియా యుద్దాల కారణంగా మన దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం అందిరికి తెలిసిందే ఈ కారణంగానే హైదరాబాద్ సహా చాలా నగరాల్లో హోటల్స్, రెస్టారెంట్స్ మూతబడ్డాయి. కొన్ని దగ్గర గ్యాస్ దొరుకుతున్నప్పటికీ.. బుక్‌ చేసుకుంటే రావడానికి లేట్ అవుతుంది. ఈ క్రమంలో గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మేం చెప్పబోయే ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు గ్యాస్‌ను ఆదా చేసుకోవచ్చు. ఎలానో చూద్దం.

1 / 5
వంట చేసేటప్పుడు గ్యాస్ అయిపోవడం ఒక పెద్ద సమస్య. ఈ కష్టకాలంలో కొత్త సిలిండర్ దొరకడం కష్టం కాబట్టి, మీ దగ్గర ఉన్న గ్యాస్‌ను తెలివిగా వాడుకోవడం చాలా అవసరం. ఇందుకోసం మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో తెలుసుకోవాలి. ఒక గుడ్డను నీటిలో నానబెట్టి, దానిని సిలిండర్ చుట్టూ 2-3 నిమిషాల పాటు చుట్టండి. మీరు గుడ్డను తీసివేసినప్పుడు, సిలిండర్‌లో ఏ భాగం అయితే త్వరగా ఆరిపోతుందో, అక్కడ గ్యాస్ లేదని అర్థం. తేమ మిగిలి ఉన్న భాగంలోనే గ్యాస్ ఉందని అర్థం.

2 / 5
మీరు గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవాలి అంటే వంట చేసేప్పుడు గ్యాస్ బర్నర్‌ను తక్కువగా ఉంచుకోండి.. ఎల్లప్పుడూ అధిక మంటపై ఉంచవద్దు. వీలైనంత వరకు తక్కువ లేదా మధ్యస్థ మంటపై వంట చేయడం వల్ల సిలిండర్ మన్నిక పెరుగుతుంది. అలాగే వంట చేసేటప్పుడు పాత్రల మూత పెట్టడం మర్చిపోవద్దు. ఇలా చేయడం ద్వారా అవిరి లోపలే ఉండి ఆహారం త్వరగా ఉడకడమే కాకుండా గ్యాస్ కూడా ఆదా అవుతుంది.

3 / 5
మీ గ్యాస్ స్టవ్ బర్నర్‌ మురికిగా ఉంటే దాన్ని వెంటనే క్లీన్ చేసుకోండి. ఎందుకంటే దుమ్మ లేదా నూనె ఉంటే, మంట సరిగ్గా మండదు. దీని వల్ల గ్యాస్ వేస్ట్ అవుతుంది. బర్నర్‌ను క్రమం తప్పకుండా శుభ్రపరచడం వల్ల గ్యాస్ వృధా కాకుండా నివారించవచ్చు.

4 / 5
చాలా మంది కుండలో కొంత గ్యాస్ ఉండగానే అయిపోయింది అనుకొని దాన్ని పక్కన పెడతారు. మీ బర్నర్ నుంచి మంట చిన్నగా వస్తుంటే.. గ్యాస్ చివరి స్టేజ్‌లో ఉందంటే.. మీరు ఒక పెద్ద బకెట్‌లో హాట్‌ వాటర్ పోసి సిలిండర్‌ను అందులో ఉంచండి. దీని ద్వారా మిగిలి ఉన్న గ్యాస్ యూజ్ చేసుకోవచ్చు.

5 / 5
ఈ సులభమైన చిట్కాలను ఉపయోగించడం ద్వారా మీ సిలిండర్ ఎప్పుడు అయిపోవచ్చో అనేది తెలుసుకొని దానిని ఇలా పొదుపుగా వాడుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు నెల రోజులు వాడే సిలిండర్‌ను మరో వారం వరకు పెంచుకోవచ్చు.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు)

Follow Us