
ఈ మధ్య పర్సనాలిటీ టెస్ట్‌లు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. చాలా మంది వీటిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అందులో ఉన్నవాటిని తమతో పోల్చుకొని వారి వ్యక్తిత్వం, గుణ గణాలు తెలుసుకుంటున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ వ్యక్తిత్వ పరీక్షను తెలియజేసే ఫొటో వైరల్ అవుతుంది. అందులో అందమైన మూడు గులాబీలు ఉన్నాయి. అయితే ఇవి మీ వ్యక్తిత్వాన్నే కాకుండా, మీరు ఎదుర్కునే ఒత్తిడిని కూడా రివీల్ చేస్తాయంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

చాలా మంది జ్యోతిష్య శాస్త్రం, న్యూమరాలజీ ప్రకారం తమ కెరీర్, వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటే, మరికొంత మంది మాత్రం వ్యక్తిత్వ పరీక్ష ప్రకారం తమ వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటారు. అయితే వ్యక్తిత్వ పరీక్ష మీ గుణ గణాలే కాకుండా మీరు ఎదుర్కునే ఒత్తిడి గురించి కూడా తెలియజేస్తుంది. కాగా ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. పై ఫోటోలో కీచైన్‌తో ఉన్న ఎరుపు రంగు గులాబీ, తేల గులాబీ, తెల్ల గులాబీల గుత్తి మూడు ఫ్లవర్స్ ఉన్నాయి. అయితే మీరు ఎంచుకునే గులాబీనే మీలో ఉన్న ఒత్తిడిని తెలియజేస్తుంది. అది ఎలాగో చూద్దాం.

కీచైన్‌తో ఉన్న ఎరుపు రంగు గులాబీ, మీరు గనుక కీ చైన్‌తో ఉన్న ఎరుపు రంగు గులాబీని ఎంచుకునే వ్యక్తులు ఒత్తిడి సమయంలో దాని నుంచి బయటపడటానికి పరిష్కారాలను కనుగొనడంలో చాలా ముందు చూపు ఉండే వ్యక్తులు. ఇలాంటి వారు చాలా సులభంగా సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కష్టతరమైన పరిస్థితుల నుంచి బయటపడటం కంటే వాటిని ఎదుర్కునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటారు. కానీ దాని నుంచి చాలా త్వరగా బయటపడతారు.

లేత గులాబీ రంగు పువ్వును ఎంచుకునే వ్యక్తులు, తమ జీవితంలో నిరంతరం ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా వీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇతరుల నుంచి ఓదార్పు, భరోసాను కోరుకుంటారు. అంతే కాకుండా అధిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇతరులతో మాట్లాడటం, ప్రశాంతంగా పాటలు వినడం లాంటివి చేస్తుంటారు. ముఖ్యంగా వీరు చాలా సార్లు అధిక ఒత్తిడి ఎదుర్కునే సమయంలో వివాదాలకంటే, శాంతి వాతావరణం కోరుకుంటారు.

తెలుపు రంగు గులాబీల గుత్తిని ఎంచుకునే వ్యక్తులు చాలా చురుకు స్వభావం కలవారు. వీరు ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ దాని నుంచి బయటపడటానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తారు. మంచి ఆలోచనా శక్తి ఉంటుంది. వీరి జీవన శైలి, వీరి వ్యక్తిత్వం, వీరిలో ఉండే కలిసిపోయే తత్వం వీరిని త్వరగా ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తాయి. ఇలా ఒక్కో గులాబీ మీరు ఒత్తిడిని ఎదుర్కునే విధానం, మీ భావోద్వేగ శైలిని తెలియజేస్తాయి.