Mutton Gravy Curry: అన్నం, చపాతీ, బిర్యానీలోకి అదిరిపోయే ఘుమఘుమలాడే మటన్ గ్రేవీ కర్రీ

Updated on: Nov 18, 2026 | 7:41 PM

 ఆదివారం ప్రత్యేక విందు అనగానే ముందుగా గుర్తొచ్చేది మటన్ కర్రీ. అయితే ఇంట్లో మటన్ వండినప్పుడు గ్రేవీ సరిపడా రావడం లేదనో లేదా ముక్క గట్టిగా ఉండిపోయిందనో చాలామంది అనుకుంటారు. అలా కాకుండా మటన్ ఇష్టపడని వారు కూడా లొట్టలేసుకుంటూ తినేలా, ఫుల్ గ్రేవీతో అద్భుతమైన కర్రీని సులభంగా చేసుకోవచ్చు.

1 / 5
కావలసిన పదార్థాలు: మటన్ 1 కేజీ, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు అర టీస్పూన్, నూనె 5 టేబుల్ స్పూన్లు (మ్యారినేషన్‌కు 1, మసాలా వేయించడానికి 1, తాలింపుకు 3), నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, అల్లం 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు 15, టమాటాలు 2, ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర తరుగు కొద్దిగా, జీడిపప్పు పలుకులు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, గసగసాలు 2 టీస్పూన్లు, బటర్ (లేదా నెయ్యి) 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, హోల్ గరం మసాలా (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, మిరియాలు, జీలకర్ర) కొద్దిగా, మటన్ మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, పుదీనా ఆకులు కొద్దిగా, నీళ్లు సరిపడా.

2 / 5
ముందుగా కేజీ మటన్‌ను నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి, చివరగా కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి కడిగితే నీచు వాసన పూర్తిగా పోతుంది. నీళ్లన్నీ వంపేసిన మటన్ ముక్కల్లో రెండు టేబుల్ స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. ఇలా నానబెట్టడం వల్ల ముక్కలు ఎంతో మృదువుగా ఉడుకుతాయి.

3 / 5
ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి. ఇందులో అల్లం ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, పెద్ద ముక్కలుగా కోసిన టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా మగ్గించాలి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి కలిపి, చివరగా జీడిపప్పు పలుకులు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, గసగసాలు వేసి సన్నని మంటపై వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.

4 / 5
మళ్లీ అదే కుక్కర్‌లో మూడు టేబుల్ స్పూన్ల నూనె, ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి కరిగించాలి. ఇందులో నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా దినుసులు వేసి వేయించాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ ముక్కలను వేసి పచ్చివాసన పోయేంత వరకు నూనెలో బాగా వేయించాలి. నీళ్లు పోయకుండా కుక్కర్ మూత పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

5 / 5
ఆవిరి పోయిన తర్వాత మూత తీసి, స్టవ్ వెలిగించి ముందుగా రుబ్బుకున్న మసాలా పేస్ట్, గ్రేవీకి సరిపడా నీళ్లు, రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి. గ్రేవీ ఉడుకుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా పొడి వేసి, కుక్కర్ మూత పెట్టి మరో విజిల్ రానివ్వాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా చల్లుకుంటే ఘుమఘుమలాడే మటన్ గ్రేవీ కర్రీ సిద్ధం.

Loading...
Unable to load recommendations.
Follow Us