
నేటి కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. తరచుగా మనం చేసే కొన్ని పొరపాట్లు కారణంగా లేనిపోని చిక్కుల్లో పడుతుంటాం. అవి కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యగా రాత్రివేళల్లో భోజనంలో అన్నం, చపాతీలలో ఏది తీసుకుంటే ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో చాలా మందికి సరైన అవగాహన ఉండదు.

చాలా కుటుంబాల్లో చపాతీ, అన్నం లేకుండా భోజనం సంపూర్ణం కాదు. చపాతీ, అన్నం తినేంత వరకు అది భోజనంలా అనిపించదు. కొందరు చపాతీని ఆరోగ్యకరమైనదిగా భావిస్తే, మరికొందరు అన్నం తేలికైనదని, సులభంగా జీర్ణమవుతుందని అనుకుంటారు.

ఈ రెండు ఆహారాలలో ఏది సులభంగా జీర్ణమవుతుంది? దేనికి ఎక్కువ సమయం పడుతుంది అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అన్నం జీర్ణం కావడానికి తక్కువ సమయం పడుతుంది. కానీ చపాతీ తినడం కూడా మంచిదే.

నిపుణుల అభిప్రాయం ప్రకారం అన్నం జీర్ణం కావడానికి సాధారణంగా 1 నుండి 2 గంటల సమయం పడుతుంది. అన్నంలో అధిక మొత్తంలో పీచుపదార్థం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అన్నం శరీరంలోకి ప్రవేశించినప్పుడు త్వరగా గ్లూకోజ్‌గా మారుతుంది. అందుకే అనారోగ్యంతో లేదా బలహీనంగా ఉన్నవారికి తరచుగా అన్నం తినమని సలహా ఇస్తారు. ఇది కడుపును తేలికగా ఉంచి, తక్షణ శక్తిని అందిస్తుంది.

తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. జీర్ణక్రియకు తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ మంచిది. మరింత ప్రయోజనకరమైనది. కాబట్టి రాత్రి పూట చపాతీ బదులు బ్రౌన్ రైస్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. చపాతీ పగటి వేళల్లో తీసుకుంటే మంచిది.