
కావలసిన పదార్థాలు: అరకిలో బోన్‌లెస్ చికెన్, 1 టేబుల్ స్పూన్ శెనగపిండి, 1 టేబుల్ స్పూన్ వేడి నూనె, పావు కప్పు గట్టి పెరుగు, 2 టీస్పూన్ల ఆవ నూనె, 1 టీస్పూన్ కారం పొడి, 1 టీస్పూన్ కాశ్మీరి లాల్ మిర్చి పౌడర్, 2 టీస్పూన్ల అల్లం-వెల్లుల్లి పేస్ట్, 1½ టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ జీలకర్ర పొడి, అర టీస్పూన్ మిరియాల పొడి, 1 టీస్పూన్ గరం మసాలా పొడి, అర టీస్పూన్ చాట్ మసాలా పొడి, అర టీస్పూన్ కసూరీ మేథీ, పావు టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ నల్ల ఉప్పు, రుచికి సరిపడా రెగ్యులర్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, పావు కప్పు తాజా కొత్తిమీర తరుగు, అర చెక్క నిమ్మరసం, బొగ్గు ముక్క & వెన్న – స్మోకీ ఫ్లేవర్ కోసం, స్పెషల్ గార్లిక్ బటర్ గ్లేజ్ సాస్ కోసం: 2 నుండి 3 టేబుల్ స్పూన్ల కరిగించిన వెన్న, 1 టీస్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, పావు టీస్పూన్ చాట్ మసాలా, ఫ్రెష్ క్రీమ్ – 2 టీస్పూన్లు

తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్లోకి బాగా వేడిగా కాచిన 1 టేబుల్ స్పూన్ నూనెను పోయాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ శెనగపిండి వేసి విస్కర్ తో ఉండలు లేకుండా బాగా కలపాలి. ఆ తర్వాత నీరు లేని పావు కప్పు గట్టి పెరుగు వేయాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ సాధారణ కారం, 1 టీస్పూన్ కాశ్మీరి కారం, పావు టీస్పూన్ బ్లాక్ సాల్ట్, పావు టీస్పూన్ పసుపు వేయాలి.

అలాగే ఒకటిన్నర టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ జీలకర్ర పొడి, అర టీస్పూన్ మిరియాల పొడి, 1 టీస్పూన్ గరం మసాలా, అర టీస్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 2 టీస్పూన్ల అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్ కసూరీ మేథీ, కొత్తిమీర తరుగు మరియు అర చెక్క నిమ్మరసం పిండాలి. చివరగా 2 టీస్పూన్ల ఆవ నూనె (మస్టర్డ్ ఆయిల్) వేసి మసాలాలన్నింటినీ చిక్కటి నునుపైన పేస్ట్‌లా కలపాలి. ఈ మసాలా పేస్ట్‌లోకి శుభ్రం చేసి మీడియం సైజు ముక్కలుగా కోసిన అరకిలో బోన్‌లెస్ చికెన్‌ను వేసి.. ప్రతి ముక్కకూ మసాలా పట్టేలా చేత్తో బాగా మర్దన చేయాలి. 15 నిమిషాలు నాననివ్వాలి.
![చికెన్ గిన్నె మధ్యలో ఒక చిన్న స్టీల్ కప్పును ఉంచాలి 5]. స్టవ్‌పై ఎర్రగా కాల్చిన బొగ్గు ముక్కను ఆ కప్పులో పెట్టి.. బొగ్గుపై అర టీస్పూన్ బటర్ వేయాలి. పొగ రావడం ప్రారంభం కాగానే వెంటనే గిన్నెపై గట్టి మూతపెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు కదపకుండా ఉంచాలి. బొగ్గు స్మోకీ ఫ్లేవర్ చికెన్‌కు పట్టి అద్భుతమైన వాసన వస్తుంది. మ్యారినేట్ అయిన చికెన్ ముక్కలను స్కూవర్ రాడ్స్‌కు (చువ్వలకు) కొద్దిపాటి గ్యాప్‌తో గుచ్చుకోవాలి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2026/11/chicken-tikka-4.jpg?q=51)
చికెన్ గిన్నె మధ్యలో ఒక చిన్న స్టీల్ కప్పును ఉంచాలి 5]. స్టవ్‌పై ఎర్రగా కాల్చిన బొగ్గు ముక్కను ఆ కప్పులో పెట్టి.. బొగ్గుపై అర టీస్పూన్ బటర్ వేయాలి. పొగ రావడం ప్రారంభం కాగానే వెంటనే గిన్నెపై గట్టి మూతపెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు కదపకుండా ఉంచాలి. బొగ్గు స్మోకీ ఫ్లేవర్ చికెన్‌కు పట్టి అద్భుతమైన వాసన వస్తుంది. మ్యారినేట్ అయిన చికెన్ ముక్కలను స్కూవర్ రాడ్స్‌కు (చువ్వలకు) కొద్దిపాటి గ్యాప్‌తో గుచ్చుకోవాలి.

ఎయిర్ ఫ్రైయర్ పద్ధతి: ఎయిర్ ఫ్రైయర్ రోటిస్సేరీ రాడ్‌కు లేదా బాస్కెట్‌కు అమర్చి రొటేట్ మోడ్‌లో 360° ఎయిర్ సర్క్యులేషన్‌తో రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా మారేంత వరకు గ్రిల్ చేయాలి. స్టవ్ పద్ధతి: స్టవ్‌పై గ్రిల్ పాన్ లేదా నాన్‌స్టిక్ పెనం పెట్టి కొద్దిగా నూనె రాసి.. స్కూవర్స్ను ఉంచి మీడియం మంటపై అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి.

ఒక చిన్న బౌల్లో 2-3 టేబుల్ స్పూన్ల కరిగించిన వెన్న, 1 టీస్పూన్ సన్నని వెల్లుల్లి తరుగు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, పావు టీస్పూన్ చాట్ మసాలా, 2 టీస్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలపాలి. బాగా గ్రిల్ అయి వేడిగా ఉన్న చికెన్ టిక్కా ముక్కలపై ఈ బటర్ సాస్‌ను బ్రష్‌తో సమంగా అప్లై చేయాలి. అంతే, నోరూరించే రెస్టారెంట్ స్టైల్ 'చికెన్ టిక్కా' సిద్ధం! వేడివేడి చికెన్ ముక్కలను ఇదే బటర్ సాస్‌లో డిప్ చేసిన ఉల్లిపాయ చక్రాలు, నిమ్మ చెక్కలు మరియు ఘాటైన పుదీనా గ్రీన్ చట్నీతో నంజుకుని తింటుంటే.. బొగ్గు పొగ పరిమళం, వెల్లుల్లి-వెన్న కమ్మదనంతో చికెన్ నోట్లో కరిగిపోతూ అమృతతుల్యమైన అనుభూతినిస్తుంది!