కల్తీ పనీర్‌ను ఇలా గుర్తించండి.. ఇంట్లోనే ఈ సింపుల్ టెస్టులు చేస్తే చాలు..

Updated on: Apr 23, 2026 | 4:43 PM

Real vs Fake Paneer: మీరు పనీర్ ప్రియులా? హోటల్‌కు వెళ్లినా, ఇంట్లో పండుగ ఉన్నా పనీర్ వంటకం ఉండాల్సిందేనా? అయితే ఒక్క నిమిషం ఆగండి.. మీ ప్లేట్‌లోకి వస్తోంది స్వచ్ఛమైన పన్నీరే అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. నీర్ పేరుతో మార్కెట్‌ను ముంచెత్తుతున్న నకిలీ ఆయిల్ ముక్కల వెనుక ఉన్న భయంకరమైన నిజం ఏంటో తెలుసా? అసలైన పనీర్‌ను ఇంట్లోనే ఎలా గుర్తించాలి అనే విషయాలు తెలుసుకుందాం..

1 / 5
పనీర్ బటర్ మసాలా నుండి పాలక్ పనీర్ వరకు.. శుభకార్యమైనా, ఆదివారం విందు అయినా పనీర్ ఉండాల్సిందే. అయితే మార్కెట్లో విరివిగా లభిస్తున్న పనీర్ అంతా పాలతోనే తయారవుతుందని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. తక్కువ ధరకు ఆశపడి మీరు కొనే పనీర్ మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అసలైన పనీర్‌కు, డైరీ అనలాగ్ అని పిలిచే నకిలీ పనీర్‌కు మధ్య ఉన్న తేడాలను గుర్తించకపోతే ప్రమాదంలో పడ్డట్టే.

2 / 5
చాలా మంది హోటళ్లు, రెస్టారెంట్లు, స్థానిక మార్కెట్లలో మనం చూసేది అసలైన పనీర్ కాదు. దీనిని సాంకేతిక భాషలో డైరీ అనలాగ్ అని పిలుస్తారు. లాభాల కోసం కక్కుర్తి పడే కొందరు వ్యాపారులు పాలకు బదులుగా వీటిని వాడుతున్నారు. స్వచ్ఛమైన పనీర్‌ను పాలను విరగ్గొట్టి, ఆ గడ్డను వడకట్టి తయారు చేస్తారు. ఇందులో ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.

3 / 5
నకిలీ పనీర్‌ను తయారు చేయడానికి అస్సలు పాలను వాడరు. తక్కువ నాణ్యత గల పాలపొడిని తీసుకుని, అందులో పామాయిల్ లేదా సోయాబీన్ నూనెను భారీగా కలుపుతారు. ఆ మిశ్రమం గడ్డకట్టడానికి హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్, ప్రమాదకరమైన స్టెబిలైజర్లను ఉపయోగిస్తారు. చూడటానికి అచ్చం పనీర్‌లాగే మెరుస్తూ ఉంటుంది కానీ ఇది కేవలం నూనె గడ్డ మాత్రమే..

4 / 5
ఇంట్లోనే పరీక్షించండిలా: మీరు కొన్న పనీర్ కల్తీదో కాదో తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించండి. అసలైన పనీర్‌ను నొక్కితే పొడిపొడిగా రాలిపోతుంది. నకిలీ పనీర్ రబ్బరులా సాగుతుంది లేదా జిగటగా ఉంటుంది. వేడి నీటిలో వేసినప్పుడు అసలైన పనీర్ మెత్తగా మారుతుంది. నకిలీ పనీర్ గట్టిపడిపోతుంది. పనీర్ ముక్కపై కొంచెం అయోడిన్ వేస్తే అది నీలం లేదా నలుపు రంగులోకి మారితే, అందులో పిండిపదార్థం కలిపారని అర్థం. నకిలీ పనీర్‌లో నూనె శాతం ఎక్కువగా ఉంటే అది నీటిపై తేలే అవకాశం ఉంటుంది, స్వచ్ఛమైన పనీర్ మునిగిపోతుంది.

5 / 5
తక్కువ ధరకు దొరుకుతోందా?: మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు పనీర్ లభిస్తుందంటే అది ఖచ్చితంగా డైరీ అనలాగ్ అయ్యే అవకాశం ఉంది. ఆహార భద్రతా నిబంధనల ప్రకారం.. నూనెతో చేసిన ఉత్పత్తులను పనీర్ అని అమ్మడం నేరం. ప్యాకెట్ కొనే ముందు లేబుల్‌పై 100శాతం స్వచ్చమైన పాలు అని ఉందో లేదో తనిఖీ చేయండి. డబ్బు ఆదా కోసం కల్తీ పనీర్ కొని హాస్పిటల్ పాలయ్యే కంటే కాస్త ఎక్కువ ధరైనా స్వచ్ఛమైన పనీర్ వాడటం ఉత్తమం. వీలైతే ఇంట్లోనే పాలను విరగ్గొట్టి తాజా పనీర్‌ను తయారు చేసుకోవడం మీ కుటుంబ ఆరోగ్యానికి అత్యంత క్షేమకరం.

Follow Us