
రాగి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా దీనిలో శరీరానికి కావల్సిన కాల్షియం, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అందుకే పాతకాలం నుంచి ఈ రాగితో చేసిన ఆహారాలను తినే వాళ్లు. ఇది శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిదిగా చెబుతున్నారు. మీరు దీనిని బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఏ రకంగా అయినా తినొచ్చు. ఈ రాగి రోటీలు మంచి ఎంపిక.

రాగి రోటీలకు కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల రాగి పిండి , ఒక పెద్ద ఉల్లిపాయ , నాలుగు పచ్చిమిర్చి , ఒక కట్ట కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , రుచికి సరిపడా ఉప్పు , ఇంకా అవసరమైనంత నీరును తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే రుచి అదిరిపోతోంది.

రాగి రోటీలు తయారీ విధానం: ముందుగా పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో రాగి పిండి తీసుకుని దానిలో ఉప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా దీనిలోతురిమిన ఉల్లిపాయ ముక్కలు , ఇంకా నాలుగు పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా నీరు పోస్తూ రోటీ పిండిలా కలపాలి.

రాగి రోటీలు తయారీ విధానం స్టెప్ -1: ఈ పిండిని మరీ గట్టిగా లేదా మరీ పలుచగా అసలు కలుపుకోకూడదు. ఇంకా దీనిని ప్లాస్టిక్ షీట్ పై పెట్టి, దీని మీద కొద్దిగా నీరు చల్లి ఈ పిండిని చిన్న ఉండలుగా చేసి ఇంకో చేత్తో రోటీలా ఒత్తాలి. అలాగే ,వేడెక్కిన పెనంపై రోటీని రెండు వైపులా బాగా కాల్చాలి.

రాగి రోటీలు తయారీ విధానం స్టెప్ -3 : మీకు ఇంకా రుచి కావాలంటే దీని మీద కొద్దిగా నెయ్యి వేసి తింటే అబ్బబ్బా అంటూ ఆపకుండా లాగిస్తారు. ఇది లేకపోయిన కూడా ఇంతే రుచిగా ఉంటుంది. అయితే, ఈ రాగి రోటీలను వేడి వేడిగా తింటే ఆ రుచే వేరు. ఇంకా మీరు పల్లీల చట్నీ, అల్లం చట్నీతో తింటే అదిరిపోతోంది.