మినపప్పు దోస దీని ముందు జుజుబీ.. ఉదయాన్నే ఒక్కటి తింటే ఇమ్యూనిటీ డబుల్..

Updated on: Oct 26, 2026 | 11:31 AM

ఈ పిండితో అప్పటికప్పుడు దోసలుగా తయారుచేయడం ఎలాగో తెలుసుకోండి. బొంబాయి రవ్వ, పెరుగుతో కలిపి చేసే ఈ దోసలు రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఎప్పుడైనా మీ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు.. పిల్లల అల్పాహారం కోసం కేవలం పది నిమిషాల్లో ఈ మెత్తని, పొంగిన బన్ దోసలను రెడీ చేయవచ్చు..

1 / 5
తయారీకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి - 1 కప్పు, బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) - ½ కప్పు, పెరుగు - 1 కప్పు, నీరు - ½ కప్పు
ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది), టమాటో - 1 పెద్దది లేదా 2 చిన్నవి (చిన్నగా తరిగినవి), పచ్చిమిర్చి - రుచికి సరిపడా (చిన్నగా తరిగినవి), కొత్తిమీర తరుగు - కొద్దిగా, కరివేపాకు - కొద్దిగా, ఆవాలు, జీలకర్ర - 1 టీస్పూన్,  ఇంగువ - చిటికెడు,  వంట సోడా - ¼ టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా,  నూనె - 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి.

తయారీకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి - 1 కప్పు, బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) - ½ కప్పు, పెరుగు - 1 కప్పు, నీరు - ½ కప్పు ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది), టమాటో - 1 పెద్దది లేదా 2 చిన్నవి (చిన్నగా తరిగినవి), పచ్చిమిర్చి - రుచికి సరిపడా (చిన్నగా తరిగినవి), కొత్తిమీర తరుగు - కొద్దిగా, కరివేపాకు - కొద్దిగా, ఆవాలు, జీలకర్ర - 1 టీస్పూన్, ఇంగువ - చిటికెడు, వంట సోడా - ¼ టీస్పూన్ ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి.

2 / 5
ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ గిన్నె తీసుకుని, అందులోకి అర కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు రాగి పిండి, 1 కప్పు పెరుగు వేయాలి. పెరుగుకు బదులుగా మజ్జిగ వాడుతుంటే 1.5 కప్పుల వరకు తీసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి.
రాగి పిండి, రవ్వ, పెరుగు బాగా కలిసిన తర్వాత, అర కప్పు నీళ్లు పోసి మళ్లీ కలుపాలి. ఇలా కలిపిన పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టి నానబెట్టాలి. రవ్వ నానడం వల్ల దోసలు చక్కగా పొంగుతాయి.

ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ గిన్నె తీసుకుని, అందులోకి అర కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు రాగి పిండి, 1 కప్పు పెరుగు వేయాలి. పెరుగుకు బదులుగా మజ్జిగ వాడుతుంటే 1.5 కప్పుల వరకు తీసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. రాగి పిండి, రవ్వ, పెరుగు బాగా కలిసిన తర్వాత, అర కప్పు నీళ్లు పోసి మళ్లీ కలుపాలి. ఇలా కలిపిన పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టి నానబెట్టాలి. రవ్వ నానడం వల్ల దోసలు చక్కగా పొంగుతాయి.

3 / 5
పది నిమిషాలు నానిన పిండిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. రవ్వ రవ్వగా ఉండకుండా, దోస పిండిలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు కలపకుండా, పల్చగా చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పిండిని తిరిగి అదే మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, 1.5 టీస్పూన్ల నూనె వేయాలి. నూనె వేడి కాగానే ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించాలి. తరువాత చిటికెడు ఇంగువ వేసి వేయించి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత, తరిగిన టమాటో ముక్కలు వేసి, టమాటోలు మెత్తబడే వరకు వేయించి, స్టవ్ ఆఫ్ చేయాలి.

4 / 5
ముందుగా సిద్ధం చేసుకున్న రాగి పిండిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, అలాగే తయారుచేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని వేయాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, పావు  టీస్పూన్ వంట సోడా వేయాలి. వంట సోడా వేయడం వల్ల దోసలు బాగా పొంగుతాయి, మెత్తగా వస్తాయి. ఈ పదార్థాలన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి.

5 / 5
స్టవ్ ఆన్ చేసి, చిన్న కడాయిని పెట్టి, కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయాలి. కడాయి వేడి కాగానే, గరిటెతో పిండిని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా చిన్న బన్ లాగా వేయాలి. ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి, రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. చిన్న కడాయిలో వేయడం వల్ల బన్ దోస ఆకారం చక్కగా వస్తుంది, పెద్ద కడాయిలో వేస్తే సెట్ దోస లాగా వస్తుంది. ఇలాగే మిగిలిన పిండితో కూడా దోసలు తయారుచేసుకోవాలి. వేడివేడి రాగి బన్ దోసలను మీకు నచ్చిన చట్నీతో (పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటో చట్నీ) వడ్డించవచ్చు. ఇది టమాటో-పచ్చిమిర్చి చట్నీతో అయితే మరింత అద్భుతంగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us