1 / 5
ఉసిరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. చలికాలంలో రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఉసిరి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.