కుస్తీలు పడే పనిలేదు.. జామ్ అయిన కుక్కర్ విజిల్‌ను ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి.

Updated on: Oct 03, 2026 | 9:18 PM

వంట త్వరగా పూర్తి అవ్వాలంటే.. ప్రెషర్ కుక్కర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఆహారం త్వరగా ఉడకడమే కాకుండా.. గ్యాస్ కూడా తక్కువ కాలుతుంది. అందుకే చాలా మంది పప్పు వంటి కూరలను కుక్కర్లలో చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఈ పప్పుకుక్కర్‌కు ఉండే విజిల్ గట్టిగా దానికే అతుక్కుపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థంకాక చాలా మంది కంగారు పడుతుంటారు. మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే.. ఈ కింద చెప్పబోయే సింపుల్ చిట్కాదో దాన్ని ఈజీగా తొలగించండి.

1 / 5
ఇంట్లో పప్పు లేదా రైస్ వండడానికి చాలా మంది ఫ్రెషర్ కుక్కర్లను వాడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు పప్పులో ఉండే స్టార్చ్ లేదా పొట్టు పైకి వచ్చి విజిల్ ఉండే భాగంలో పేరుకుపోయి అది పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. దీని వల్ల కుక్కర్‌కు ఉండే విజిల్ తీయడానికి రాదు.. అలాంటప్పుడు.. కుక్కర్ పేలిపోతుందేమోనని చాలా మంది టెన్షన్ పడతారు.

2 / 5
మీరు కూడా ఇలాంటి సమస్య ఫేస్ చేస్తే.. దాన్ని సులభంగా ఎలా తీయాలో కచ్చితంగా తెలుసుకోవాలి. ఇలా ఇరుక్కున్న విజిల్‌ను ఎలా తొలగించాలి అనే విషయానికి సంబంధించిన ఓ ట్రిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటో ఇక్కడ చూద్దాం.

3 / 5
ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా వేడి నీటిని తీసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా డిటర్జెంట్, ఒక ప్యాకెట్ ఈనో  పౌడర్ వేసి బాగా కలపండి. తర్వాత ఈ నీటిలో కుక్కర్ విజిల్, దాని చుట్టుపక్కల భాగాలను కొద్దిసేపు ముంచి ఉంచండి. ఈనోని రసాయనాలు, వేడి నీళ్ల మిశ్రమం విజిల్ లోపల పేరుకుపోయిన జిడ్డును, మురికిని తొలగిస్తాయి. తర్వాత ఓ సన్నని పిన్ లేదా టూత్‌బ్రష్ సహాయంతో దాన్ని లోపలి భాగం వరకు మొత్తం నీట్‌గా క్లిన్ చేయండి.. తర్వాత మరోసారి మంచినీటితో కడిగితే చాలు. మీ కుక్కర్ విజిల్ మరోసారి బిగుసుకుపోదు.

4 / 5
కుక్కర్ వాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే దానితో కొంటెం పొరపాటు చేసినా అది పేలిపోయి.. దానిలో ఉండే వేడి పదార్థం మీద పడే ప్రమాదం ఉంటుంది. మీరు కుక్కర్ వంట చేసేప్పుడు దాని రబ్బర్‌ను సరిగ్గా పెట్టారో లేదో చెక్‌ చేసుకోండి.. అలాగే సేఫ్టీ వాల్వ్‌లో ఎలాంటి చెత్తాచెదారం ఇరుక్కోకుండా చూసుకోండి.. వంట తర్వాత పూర్తిగా ఎయిర్ పోయిన తర్వాతే మూత ఓపెన్ చేయండి. విజిల్ సరిగ్గా రాకపోతే.. వెంటనే దాన్ని రిపేర్ చేయించండి.

5 / 5
మీరు మంటపై కుక్కర్ పెట్టిన చాలా సమయానికి కూడా విజిల్ రాకపోతే.. అది బిగుసుకుపోయిందని అర్థం. దాన్ని అలానే వదిలేస్తే.. లోపల ఆవిరి పెరిగిపోయి పేలే ప్రమాదం ఉంది. కాబట్టి విజిల్ రావడం లేదని మీకు అనిపించిన వెంటనే స్టవ్ ఆపేసి.. కుక్కర్ నుంచి పూర్తిగా గాలి తీసిన తర్వాత మాత్రమే ఓపెన్ చేసి శుభ్రం చేయండి. పొరపాటున కూడా ఎయిర్ తీయకుండా కుక్కర్‌ను ఓపెన్ చేయవద్దు.

Loading...
Unable to load recommendations.
Follow Us