ప్రధానమంత్రుల గురించిన సమాచారాన్ని పొందడానికి దూరదర్శన్, ఫిల్మ్ డివిజన్, పార్లమెంట్ టీవీ, రక్షణ మంత్రిత్వ శాఖ, మీడియా హౌస్, ప్రింట్ మీడియా, ఫారిన్ న్యూస్ ఏజెన్సీలు, విదేశాంగ మంత్రిత్వ శాఖలోని మ్యూజియంల నుండి కూడా సహాయం తీసుకున్నారు. మ్యూజియంలో వర్చువల్ రియాలిటీ, మల్టీ టచ్, మల్టీ మీడియా, ఇంటరాక్టివ్ కియోస్క్‌లు, కంప్యూటరైజ్డ్ కైనటిక్ శిల్పాలు, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు, ఇంటరాక్టివ్ స్క్రీన్‌లు వంటి అత్యాధునిక సాంకేతికత ఉంది.