
చాలా మంది రాశిఫలాలు, న్యూమరాలజీ ప్రకారం తమ వ్యక్తిత్వం, భవిష్యత్తు తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మరికొంత మంది వ్యక్తిత్వ పరీక్ష ద్వారా తమ క్యారెక్టర్ తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా చేతుల ఆకారం, కూర్చొనే విధానం, డ్రెస్సింగ్ స్టైల్ ఇలా, వాటి బట్టి వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటారు. అయితే ఇలానే కాకుండా ఒక వ్యక్తి కూరగాయలు కట్ చేసే విధానం బట్టి కూడా తమ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చునంట.

కొంత మంది చాలా నెమ్మదిగా సమానంగా కూరగాయలు కట్ చేస్తుంటారు. ఇలా సమానంగా కూరగాయలు కట్ చేసే వ్యక్తులు చాలా ఓపిక ఉండే వ్యక్తులు. అంతే కాకుండా తమ పనిని సమయం ప్రకారం, చాలా సులభంగా పూర్తి చేస్తారు. చాలా పట్టుదలతో పనిని పూర్తి చేస్తారు. అందుకే ఇలాంటి వారు చాలా సహనవంతులు అంటారు.

త్వర త్వరగా కూరగాయలు కట్ చేయడం. ఇలా త్వర త్వరగా కూరగాయలు కట్ చేసే వ్యక్తులు చాలా మంచి నైపుణ్యం కలవారు. వీరు అన్నింట్లో చాలా చురుకుగా పాల్గొంటారు. అందరితో సులభంగా కలిసిపోయే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు తమ పనిని సులభంగా పూర్తి చేసే నేర్పు కలిగి ఉంటారు. అంతే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తారు.

అస్తవ్యస్తంగా కూరగాయలు కట్ చేయడం. కొందరు కూరగాయలు కోయడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కుంటారు. వాటిని సక్రమమైన పద్ధతిలో కాకుండా, అస్తవ్యస్తంగా కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా అస్తవ్యస్తంగా కూరగాయలు కట్ చేసే వారు ఒకే నిర్ణయంపై ఆధారపడి ఉండలేరంట. వీరి ఆలోచనలు నిలకడగా ఉండవు అని చెబుతున్నారు నిపుణులు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు