
కావాల్సిన పదార్ధాలు : 4 కోడిగుడ్లు, అర టీ స్పూన్ ఉప్పు, 10 కరివేపాకు ఆకులు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఉల్లియలు, అర టీ స్పూన్ మసాలా పొడి రెండు టేబుల్ స్పూన్స కారం, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా 4 కోడిగుడ్లను తీసుకుని వాటిని బ్రేక్ చేసిఎగ్ వైట్ ను సెపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిలో కొద్దీగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఆకులు 4 పచ్చిమిర్చి వేసి బంగారు రంగులోకి మారే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా వేయించాలి.

ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తర్వాత ఎగ్ వైట్ వేసి ఇప్పుడు దీనిలో అర టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్స్ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ , ధనియాల పొడి వేసి కలుపుకోవాలి.

ఎగ్స్ అట్టు ముక్కల్లాగా మారిన తర్వాత మసాలాలు వేసి పట్టించి 5 నిమిషాల సన్నని మీదే ఉంచాలి. ఇక దించే ముందు కొత్తిమీర వేసి దించేయండి. అంతే వేడి వేడి ఎగ్ వైట్ కోడి గుడ్డు వేపుడు రెడీ.