
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిషశాస్త్రంలోనే ఈ యోగం చాలా గొప్పదని చెబుతుంటారు ఆ యోగమే పంచ మహా పురుష యోగం. దీని వలన ఈ నెలలో రెండు రాశుల వారికి రాజయోగం పట్టబోతోంది. అంతేకాదు, వీరు ఎక్కడికి వెళ్లినా కూడా గౌరవం దొరుకుతుంది. ఇంకా డబ్బు, పదవి ఇలా ప్రతి దానిలో విజయం సాధిస్తారు.

కుంభ రాశి: ఈ పంచమహాపురుష యోగం వలన వీరి జీవితంలో కొత్త మార్పులు వస్తుంటాయి. ఒక్క దెబ్బకు అప్పులు కూడా క్లియర్ అవుతాయి. వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఇదే మంచి సమయం. మీరు చేసే పనుల్లో మీ భార్య సపోర్ట్ ఉంటుంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. కెరీర్ లో కొత్త అవకాశాలు వస్తాయి.

కర్కాటక రాశి : వీరికి కష్టాలు మొత్తం తోలిగిపోతాయి. ఎదురు దెబ్బలు తగిలినా కూడా తిరిగి నిలబడతారు. ఇంకా ఈ సమయంలో వీరికి దైవ బలం తోడుగా ఉంటుంది. భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుంది. కొత్త పనుల్లో కూడా గెలుపు ఉంటుంది. అదృష్టం కూడా వీరి వెంటే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా పోతాయి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.