
పల్లెటూరి రోటి పచ్చడిని రోట్లో కమ్మగా నూరుకుని దానిని వేడి వేడి అన్నంతో తింటే ఆ టేస్ట్ ఎక్కడా కూడా దొరకదు అంత అద్భుతంగా ఉంటుంది అలాగే దోస, ఇడ్లీల్లోకి కూడా రుచిగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం హాస్పిటల్స్‌కి లక్షలు ఖర్చు చేయకుండా ఇక్కడే దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

పల్లెటూరి రోటి పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు: పావుకిలో టమాటాలు, 200 గ్రాముల పచ్చి మిర్చి , రెండు ఉల్లిపాయలు, మూడు వంకాయలు , రెండు వెల్లుల్లి రెబ్బలు , నిమ్మకాయంత చింతపండు, రుచికి తగినంత ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగ జీలకర్ర , ఆవాలు, కరివేపాకును తీసుకోవాలి.

పల్లెటూరి రోటి పచ్చడి తయారీ విధానం: ముందుగా పాన్ పెట్టి దానిలో టమాటాలు, పచ్చి మిర్చి ముక్కలు బాగా వేయించుకోవాలి: అయితే, వీటిని సన్నని మంటపైనే మగ్గించాలి లేదంటే మాడిపోతాయి. అలాగే వీటిని బంగారు కలర్లోకి మారిన వెంటనే వీటిని పొయ్యి దించి పక్కన పెట్టుకోవాలి. మీరు కూడా ఇలాగే చేయండి

ఆ తరవాత మధ్యలో కొద్దిగా చింత పండు, పసుపును కూడా దీనిలో వేసుకోవాలి ఇంకో వైపు ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలి. మీరు పల్లీలు కూడా వేసుకోవాలి అనుకుంటే వీటిని వేరుగా వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇవి వేస్తే పల్లెటూరి రుచి వస్తుంది.

ఈ మిశ్రమం తీసుకుని రోటిలో పచ్చి మిర్చి, చింతపండు, రుచికి తగినంత ఉప్పు, వేయించిన పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా నీళ్లు కూడా పోసి దీనిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అయితే , సరైన విధంగా చేసి నెయ్యితో తింటే ఏ మాంసం కూరలు దీని ముందు పనికిరావు దీనిని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి తినండి.