
పాలకూర అంటే ఎంతో మంది ఇష్టంగా తింటారు. అయితే, ఎప్పుడు కూడా ఏదొక పప్పులు వేసి వండుతారు అయితే, ఈ సారి అలా కాకుండా పాలు పోసి చేస్తే మెత్తగా, క్రీమీగా వస్తుంది . ఇంట్లో ఒక గ్లాస్ పాలు ఉన్నా కూడా సరిపోతోంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు : 3 కట్టలు పాలకూర, ఒక కప్పు పాలు, ఒక ఉల్లిపాయ , 3 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా చిటికెడు ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ కారం, రెండు టేబుల్ స్పూన్స్ స్పూన్ నూనె , ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి , కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా మూడు కట్టలు పాలకూరను తీసుకుని బాగా కడగాలి. అయితే , మీరు దీనిని ఇసుక, కొంచం మట్టి కూడా లేకుండా రెండు మూడు సార్లు బాగా కడిగి, ఇంకా నీళ్లు కూడా వడపోసి మెత్తగా ఉంచుకోవాలి. ఇంకా ఒక పాన్లో కొద్దిగా నెయ్యి అది లేకపోతె ఆయిల్ వేసి వేడి చేయండి. ఇంకా దీనిలో జీలకర్ర కూడా వేసి వేయించండి.

ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి లేత గోధుమ రంగు వచ్చే వరకు దీనిని వేయించండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వండి. ఇంకా ఇప్పుడు తరిగిన పాలకూర వేసి బాగా కలపండి. అలాగే, చిటికెడు పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి.

పాలకూర మెత్తగా అయిన తరవాత దీనిలో పాలు పోసి ఇంకోసారి కలపండి. ఇంకా దీనిలో మూత పెట్టకుండా కలుపుతూ 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించండి. పాలు గట్టిపడి కూర మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. ఇంకా దీనిలో మసాలా పొడి కూడా వేయాలి. అలాగే, చివర్లో కొద్దిగా కొత్తిమీర కూడా చల్లి దించేసుకోండి.