
బెండకాయ తినడం ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది బెండకాయతో అనేక రకాల వంటకాలు ప్రిపేర్ చేససుకొని తింటారు. కొందరు బెండకాయ ఫ్రై చేసుకుంటే మరికొంత మంది బెండకా సూప్, కర్రీ ఇలా రకరకాల వంటలు ప్రిపేర్ చేసుకొని తింటారు.

ఇక మార్కెట్‌కు వెళ్లిన ప్రతి సారి తప్పకుండా బెండకాయలు కొనుగోలు చేసి తీసుకొస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని ఎక్కువగా తినేస్తుంటారు. అయితే బెండకాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొంత మంది వీటిని అస్సలే తినకూడదంట. కాగా, బెండకాయ ఎవరు తినకూడదో ఇప్పుడు చూసేద్దాం.

బెండకాయలో విటమిన్ కే చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన ఎవరు అయితే రక్తపలచబడటానికి ట్యాబ్ లెట్స్ వాడుతున్నారో, లేదా కొన్ని రకాల మందులు వాడే వారు కూడా వీలైనంత వరకు బెండకాయ తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా కిడ్నీ రాళ్ల సమస్యలతో సతమతం అయ్యే వారు కూడా వీలైనంత వరకు బెండకాయకు దూరంగా ఉండాలంట.

కొంత మంది జీర్ణ సమస్యలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఎవరు అయితే కడుపు నొప్పి, అజీర్ణం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో వారు కూడా వీలైనంత వరకు బెండకాయకు దూరంగా ఉండటం మంచిదంట. లేకపోతే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే అలర్జీ వంటి సమస్యలతో బాధ పడే వారు కూడా బెండకాయలు తినకూడదంట

నోట్ : పై సమాచారం ఆరోగ్య నిపుణులు, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. దీనిని కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది