Office Tips: మీరూ ఆఫీస్‌లో గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి

|

Sep 08, 2024 | 8:47 PM

కార్పొరేట్ ఆఫీస్‌ కల్చర్‌ ఇప్పుడు దాదాపు ప్రతిచోటా కనిపిస్తుంది. చాలా కంపెనీల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌కి బయోమెట్రిక్, కార్డ్ పంచింగ్ తప్పని సరైంది. కాబట్టి ఎప్పుడైనా బయటికి వెళ్లాలంటే అలా వెళ్లలేరు. మరోవైపు ఆఫీస్ రూల్స్ పాటిస్తూ 8 నుంచి 10 గంటలు ఆఫీసులోనే గడిపే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. చాలా మంది పని ఒత్తిడితో ఆఫీసులోనే మగ్గిపోతుంటారు..

1 / 5
కార్పొరేట్ ఆఫీస్‌ కల్చర్‌ ఇప్పుడు దాదాపు ప్రతిచోటా కనిపిస్తుంది. చాలా కంపెనీల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌కి బయోమెట్రిక్, కార్డ్ పంచింగ్ తప్పని సరైంది. కాబట్టి ఎప్పుడైనా బయటికి వెళ్లాలంటే అలా వెళ్లలేరు. మరోవైపు ఆఫీస్ రూల్స్ పాటిస్తూ 8 నుంచి 10 గంటలు ఆఫీసులోనే గడిపే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. చాలా మంది పని ఒత్తిడితో ఆఫీసులోనే మగ్గిపోతుంటారు.

2 / 5
ఒకే చోట గంటల తరబడి కూర్చొని, ల్యాప్‌టాప్ చూస్తూ ఉంటారు. ఈ రోజువారీ అలవాటు వల్ల శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోతుంది. కండరాల వశ్యత తగ్గుతుంది. గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆఫీసులో పనిచేసేటప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఎలా? అని ఆలోచిస్తున్నారా.. ఈ  చిట్కాలు ట్రై చేయండి.

3 / 5
ముందుగా గంటల తరబడి ఒకే చోట కూర్చునే అలవాటు మానుకోవాలి. నిర్ణీత వ్యవధిలో లేచి నిలబడండి, నడిచి, మళ్లీ కూర్చోండి. అవసరమైతే ఫోన్‌లో అలారం పెట్టుకోండి. గంట తర్వాత ఐదు నిమిషాలు అయినా సరే నడక సాగించాల్సిందే.అయితే పని ఒత్తిడిలో నీళ్లు తాగడం మర్చిపోకూడదు. చాలా ఆపీసుట్లో ఏసీ ఉండటం వల్ల తక్కువ వేడిగా ఉంటుంది. దీంతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దీంతో డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి, అలసట, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తగినంత నీళ్లు తాగాలి.

4 / 5
ప్రతి ఒక్కరికి పని సమయంలో ఎక్కువ లేదా తక్కువ ఆకలి వేస్తుంది. చాలామంది చాక్లెట్లు, బిస్కెట్లు వంటివి తింటుంటారు. ఈ అలవాటు మానేయాలి. ఆఫీసులో ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.

5 / 5
కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువసేపు కంటిన్యూగా పనిచేస్తే కళ్లు మసకబారుతాయి. కాబట్టి అవసరమైతే 'బ్లూ రే ప్రొటెక్టర్' గ్లాసెస్ ధరించండి. ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడటం ప్రాక్టీస్ చేయాలి. ఇది కళ్లకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.