
ఆదివారం వస్తే చాలు చికెన్ లేదా మటన్ ఇంట్లో ఉండకాల్సిందే. ఇంకొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాంటోళ్ళు ఎడా పెడా తింటూనే ఉంటారు. అయితే, చికెన్ లో ఒక పార్ట్ ను అస్సలు తినొద్దని చెబుతున్నారు.అదేంటో ఇక్కడ చూద్దాం.

చికెన్లో తోలు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలో అధిక కొవ్వు, క్యాలరీలు ఉంటాయి. దీనిని తిన్న తర్వాత ఆరోగ్యానికి బలం అంటున్న మాట కొంత సేపు పక్కన పెడదాము. దీని వలన నష్టాలే ఎక్కువగా ఉన్నాయి.

చికెన్ తోలు తినడం వలన బరువు ఈజీగా పెరుగుతారు. అలాగే, గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. మరి, ముఖ్యంగా బ్రాయిలర్ కోడి చికెన్ తోలు అస్సలు తినొద్దని చెబుతున్నారు.

ఎందుకంటే దీనిలో హానికర కొవ్వు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీనిని తినకపోవడమే మంచిది. ఇంకా చికెన్ స్కిన్‌లో కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)