
మీరు మార్కెట్‌కు వెళ్ళి మటన్ కొనే ముందు ఈ బామ్మ చెప్పిన చిట్కాలు తెలుసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. లేత మటన్‌కు, ముదురు మటన్‌కు మధ్య తేడా ఇలా ఈజీగా గుర్తించవచ్చు. ముదురు మటన్ వండి తినలేక ఇబ్బంది పడుతున్నారా? ఆ సమస్యకు గుడ్ బై చెప్పేయండి. కొనేటప్పుడే ఇలా సులభంగా గుర్తించే చిట్కాలు ఇక్కడ చూద్దాం..

బామ్మ చెప్పిన అద్భుత చిట్కా : మటన్ కొనేటప్పుడు ముందు మాంసం రంగు చూడాలి. ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి. లేత మటన్ లేత ఎరుపు రంగులో మెరుస్తూ ఉంటుంది. అదే ముదురు మటన్ అయితే ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఇది ముదురు మేక మాంసం అయి ఉండొచ్చు. వయసు పెరిగే క్రమంలో మాంసం రంగు మారుతుంది.

మాంసానికి అంటి ఉన్న కొవ్వును చూసి కూడా దీన్ని బాగా గుర్తించవచ్చు. ఈ కొవ్వు క్రీమ్ తెలుపు రంగులో, మెత్త మెత్తగా ఉంటే అది లేతది అని గుర్తించండి. ఇంకా ఇది ముక్కలకు సమానంగా అంటి ఉంటుంది. అదే ముదురు మాంసంలోవేరే రంగులోకి ఉంటుంది ఇది కొంచం గట్టిగా ఉంటుంది. ఈ సారి ట్రై చేయండి.

మటన్ షాపులో ముక్కలు కొట్టేటప్పుడు ఎముకలను గమనిస్తూ ఉండండి. లేత మటన్ వి అయితే ఈ ఎముకలు బుద్దిగా ఉంటాయి. ఇంకా జాయింట్ల దగ్గర ఎరుపు కలర్లో ఉంటాయి. ఇంకా ముదురు మేక ఎముకలు అయితే ఇంకా పెద్దగా లావుగా ఉంటాయి. అవి తెలుపు రంగులో కట్ చేస్తుంటేనే విరిగిపోయేలా ఉంటాయి.

ముదురు మటన్ ని కూడా లేత మటన్ లాగా వండుకోవచ్చు. అయితే, దీనిలో పచ్చి బొప్పాయి పేస్ట్ వేస్తె త్వరగా ఉడుకుతుంది. అయితే, మీరు దీనిని కుక్కర్లో ఉడికిస్తే ఇది మెత్తగా మారుతుంది. అంతే కాకుండా ఇది ప్లేట్ లోకి తినడానికి కూడా మంచిగా ఉంటుంది ఇంకా దీనిలో పెరుగు, నిమ్మరసం వేస్తే త్వరగా ఉడుకుతుంది.