
కలలు అందరికీ వస్తుంటాయి. కానీ కొన్ని సార్లు కొంత మందికి పదే పదే చెడు కలలు రావడం జరుగుతుంది. దీంతో చాలా మంది ఆందోళనకు గురి కావడం, నిద్రలో కలవరించడం, భయం వంటి అనేక సమస్యలు ఎదుర్కుంటారు. ఇక అసలు ఇలా పదే పదే పీడ కలలు ఎందుకు వస్తున్నాయని చాలా ఇబ్బంది పడిపోవడమే కాకుండా, మానసిక ఆందోళనకు గురి అవుతున్నారు. కాగా ఇప్పుడు మనం పీడకలల గురించి తెలుసుకుందాం.

పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక పరమైన సమస్యల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే కొన్ని సార్లు ఇవి కలల రూపంలో వ్యక్తం అవుతాయంట. అంతే కాకుండా చెడు సంఘటలను, ఊహించని నష్టాలు కూడా కలల రూపంలో వస్తాయి. కాబట్టి ఇటువటి కలలు వస్తే ఆందోళన అవసరం లేదు అని చెబుతున్నారు నిపుణులు. మీకు కాస్త విశ్రాంతి అవసరం అని వాటి అర్థం.

ఇక చాలా మంది ఈ చెడు కలలు వస్తే ఎక్కువగా ఆందోళనకు గురి అవుతుంటారు. ఏదో జరుగుతుంది. నాకు ఏదో ఆపద రాబోతుంది అని ఎక్కువగా భయపడి పోతుంటారు. అయితే ఇది కేవలం మన మనసులోని ఆలోచనలు మాత్రమే, వీటి వలన ఏదో జరుగుతుంది అనుకోవడం అపోహా.. ఇది భవిష్యత్తును సూచిస్తుంది అని చెప్పలేం అని చెబుతున్నారు నిపుణులు.

అంతే కాకుండా ఎక్కువగా నిద్ర పోయేవారు, హర్రర్ మూవీస్ చూసే వారు, సరిగ్గా విశ్రాంతి లేకుండా ఉండే వారు, ఎక్కువగా ఆలోచించే వారికి కూడా ఇలాంటి కలలు వస్తాయని నిపుణులు తెలియజేయడం జరుగుతుంది. అందువలన పదే పదే చెడు కలలు వస్తే అస్సలే భయపడాల్సిన పని లేదంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు