
పోషకాల గని – విడివిడిగా తింటే ఎంతో మేలు: అరటిపండులో శరీరానికి అవసరమైన పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా కండరాలను బలంగా మారుస్తాయి. మరోవైపు బొప్పాయి క్రమంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ వేగవంతమవుతుంది.

కలిపి తింటే వచ్చే దుష్ప్రభావాలు: ఆయుర్వేదం ప్రకారం అరటిపండు శరీరాన్ని చల్లబరిచే తత్వం కలిగి ఉంటుంది. బొప్పాయి శరీరానికి వేడిని కలిగిస్తుంది. ఇలా విభిన్న స్వభావాలు కలిగిన పండ్లను ఒకేసారి తినడం వల్ల శరీరంలో రసాయన సమతుల్యత దెబ్బతింటుంది.

జీర్ణక్రియ సమస్యలు: ఈ రెండు పండ్ల కలయిక వల్ల జీర్ణశక్తి మందగిస్తుంది. దీనివల్ల కడుపులో అజీర్ణం, ఉబ్బరం, వాంతులు, తల తిరగడం, తలనొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అరటి, బొప్పాయి కలిపి తినడం వల్ల ఉబ్బసం, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా చర్మంపై అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.

ఎవరు ఏ పండు తినకూడదు?: కామెర్లతో బాధపడుతున్నవారు బొప్పాయిని అస్సలు తినకూడదు. బొప్పాయిలో ఉండే పపైన్, బీటా కెరోటిన్ అనే కాంపౌండ్లు కామెర్ల తీవ్రతను మరింత పెంచుతాయి. శరీరంలో ఇప్పటికే పొటాషియం స్థాయిలు అధికంగా ఉన్నవారు అరటిపండ్లను తీసుకోకపోవడం మంచిది.

ముందు నుంచే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బొప్పాయికి దూరంగా ఉండాలి. కాబట్టి, ఈ రెండు పండ్ల వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే వీటిని ఒకేసారి కలిపి తినకుండా, వేర్వేరు సమయాల్లో మాత్రమే తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.