
తల చర్మం పొడిబారడం, మురికి, చెమట, ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా చుండ్రు పెరుకపోవడం ప్రతి ఒక్కరికి పెద్ద సమస్య. ఈ సమస్యను దూరం చేసుకునేందుకు చాలా మంది ఖరీదైన షాంపులను వాడుతారు. కానీ మన ఇంటి పరిసరాల్లో దొరికే వేపాకుతో ఈ సమస్యకు చిటికెలో గుడ్‌బై చెప్పవచ్చు. అవును వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చుండ్రును సహజంగా నివారించడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాబట్టి వేప ఆకులను ఉపయోగించి చుండ్రు సమస్యను ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ చూద్దాం.

వేపాకు, కొబ్బరినూనె: మొదటగా మీరు గుప్పెడు వేపాకులను తీసుకొని వాటిని శుభ్రం చేసి కొబ్బరినూనెలో వేసి మరిగించండి. నూనె ఆకుపచ్చ రంగులోకి మారిన వెంటనే స్టౌ ఆఫ్ చేసి నూనెను చల్లారనివ్వండి. తర్వాత అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపండి. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను తలకు పట్టించి కాసేపు బాగా మసాజ్ చేయండి, తర్వాత రోజు మార్నింగ్ తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి.ఇలా కొన్ని రోజులు చేస్తే చాలా ఈజీగా మీలో మార్పు కనిపించవచ్చు.

వేపాకు, పెరుగు మాస్క్: వేపాకు మరోలా ఉపయోగించేందుకు ఇది కూడా బెస్ట్ మార్గం. ఇందుకోసం కొన్ని తాజా వేపాకులను తీసుకొని వాటిని మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. పెరుగులోని చలువ, వేపాకులోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును బాగా తగ్గిస్తాయి.

Neem Leaf And Curd Mask (1)

వేపాకు నీటితో రిన్స్ : ఇది కూడా చుండ్రును వదిలించడంతో ప్రభావవంతంగా పనిచేసే చిట్కా.. ఇందుకోసం మొదట కొన్ని వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించాలి.. నీరు రంగు మారిన వెంటనే స్టౌ ఆపేసి కాసేపు చల్లారనివ్వాలి. మీరు స్నానం చేసేప్పుడు షాంపు పెట్టుకున్న కడుకుక్క తర్వాత ఈ వేప నీటిని జుట్టును కడుక్కోవాలి.. ఇది జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది.Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడంలేదు.