మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా, యువతలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన నషా ముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. అక్షర స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్‌తో పాటు ప్రముఖ సినీ నటుడు ఆది, ఈగల్ ఫోర్స్ శ్రీనివాస్ పలువురు ప్రముఖులు, పెద్ద ఎత్తున యువత, సైక్లింగ్ ఔత్సాహికులు పాల్గొని మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని అంబేద్కర్ యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి ప్రారంభమైన ఈ 6 కిలోమీటర్ల ర్యాలీ.. కేబుల్ బ్రిడ్జి, మైండ్‌స్పేస్ జంక్షన్, సైబర్ టవర్స్, హైటెక్స్ కమాన్ మీదుగా హైటెక్స్ మెయిన్ గేట్ వరకు కొనసాగింది.ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తుతో పాటు కుటుంబాల ప్రశాంతతను, సమాజ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

మాదకద్రవ్యాల వినియోగం కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని, అది సామాజిక భద్రతను, దేశ అభివృద్ధిని ప్రభావితం చేసే పెను సవాలు అని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌కు బానిసైన వారిని నేరస్తులుగా చూడకుండా, వారికి సరైన కౌన్సెలింగ్, వైద్యం, పునరావాసం కల్పించి తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఆయన పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 'నషా ముక్త్ భారత్ అభియాన్' ద్వారా మాదకద్రవ్యాల నిర్మూలన, వ్యసన విముక్తి మరియు పునరావాస కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించిందని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. డ్రగ్స్ సరఫరా, అక్రమ రవాణా ముఠాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు ప్రజా భాగస్వామ్యంతో ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.