
కాగా, ఇప్పుడు మనం ఆంధ్రా స్టైల్‌లో మునగాకు, టమాటా రోటీ పచ్చడి ఇంట్లోనే చాలా సులభంగా ఎలా చేయాలో చూసేద్దాం. ఇది అన్నంలోకే కాకుండా దోసె, ఇడ్లీ, చపాతీల్లోకి అదిరిపోద్దీ ముఖ్యంగా ప్రతి రోజూ ఒక ముద్దు దీంతో చాలా ఇష్టంగా తింటారు. కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, చింతపండు, నూనె, శనగపప్పు, మునగాకు, కారం, ఉప్పు, కొత్తిమీర,ఆవాలు.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మునగాకును తీసుకొని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇది ఆరే వరకు పోపు తయారు చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో నూనె పోయాలి. నూనె వేడి అయిన తర్వాత అందులో నువ్వులు, పల్లీలు, పచ్చి మర్చీ,కరివేపాకు, చిత పండు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి మంచిగా దోర దోరగా వేయించుకోవాలి . అందులోనే జీలకర్ర కూడా వేయాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే పాన్‌లో మరింత నూనె పోసి, ఆరిన మునగాకు, టమాట ముక్కలు వేసి మరోసారి దోరగా వేయించుకోవాలి. మునగాకు పచ్చి వాసన పోయి మంచిగా వేగాలి . అప్పుడే పచ్చడ కూడా చాలా రుచిగా ఉంటుంది. తర్వాత అందులో రెండు చిన్న అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ముందుగా వేయించుకున్న పచ్చి మిర్చీ, పల్లీల మిశ్రమాన్ని రోటీలో మెత్తగా దంచుకోవాలి. బరకగా, కాస్త మెత్తగా దంచుకున్న తర్వాత, అందులోనే మునగాకు మిశ్రమం కూడా వేసుకొని మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి.

తర్వాత స్టవ్ ఆన్ చేసి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లితో పోపు వేసి పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడి కారం కారంగా, నోటికి రుచిగా ఉండి, పిల్లలు సైతం ఇష్టపడేలా ఉంటుంది. మునగాకు తినని వారికి కూడా ఈ విధంగా పచ్చడి చేసి పెడితే ఇష్టంగా తింటారని