
వర్షాలు పడుతున్నప్పుడు వేడి వేడిగా తింటే ఈ గారెలు తింటే యాక్టీవ్ గా ఉంటారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే చిన్న వడలు మాదిరి కూడా చేసుకుని తినొచ్చు. ఇంకా ఇవి బయటకు బయటకు కరకరలాడుతూ ఉన్నా.. కానీ, లోపల మాత్రం తియ్యగా మెత్తగా తినడానికి మంచిగా ఉంటుంది. వీటిని సాయంత్రం తింటే ఇంకా మాంచి టేస్ట్ అంటూ నాలుగు ఎక్కువే లాగిస్తారు

మక్క లేదా మొక్కజొన్న గారెలకు కావలసిన పదార్థాలు: రెండు కప్పుల మొక్కజొన్న గింజలు, కప్పున్నర బియ్యప్పిండి, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్ , కరివేపాకు పేస్ట్ , అర కట్ట కొత్తిమీర ఆకులు , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , రుచికి తగినంత ఉప్పు , ఇంకా ఆయిల్ ను తీసుకోవాలి

మొక్కజొన్న గారెల తయారీ విధానం: మీరు ముందుగా మొక్కజొన్న గింజలను తీసుకుని వాటిని రెండు సార్లు బాగా కడిగి మిక్సీ జార్‌లో వేసి , పచ్చిమిర్చి, అల్లం కూడా వేసి కచ్చా పచ్చగా అంటే కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ఒక పెద్ద గిన్నెలో తీసుకుని బియ్యప్పిండి, శనగపిండి వేసి మిక్స్ అయ్యేలా కలాపాలి

మొక్కజొన్న గారెల తయారీ విధానం: ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలపాలి. ఇదే సమయంలో బియ్యప్పిండిని వేసుకోవాలి. ఇంకా వీటిని గారెలు మాదిరి చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకో వైపు పాన్ లో ఆయిల్ పోసి మీడియం మంటపై ఉంచాలి

మొక్కజొన్న గారెల తయారీ విధానం: ఇప్పుడు చేతికి నూనె రాసుకుని పిండిని తీసుకుని ఉండలుగా చేసుకుని గారెల్లాగా వేసుకోవాలి . పిల్లల కోసం చిన్న వడలుగా కూడా చేసుకోవచ్చు. ఆయిల్లో వేసి ఎర్రగా కాలిన తరవాత, ఇలా ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా తిప్పుకుని వీటిని గా వేయించాలి. ఈ వేయించిన మొక్కజొన్న గారెలను గిన్నెలోకి తీసుకోవాలి.