
జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

ఈ నెలలో బుధుడు మూడు సార్లకి పైగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లనున్నాడు. మరో మూడు రోజుల్లో ఉత్తర ఫాల్గుణిలోకి, ఆ తర్వాత హస్త నక్షత్రంలోకి మారనున్నాడు. దీని ప్రభావం వలన మూడు రాశుల వారికి మంచిగా ఉండనుంది. మరి, ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ధనుస్సు రాశి : వీరికి అదృష్టం కలిసొస్తుంది. ఇంకా కెరీర్ లో గుర్తింపు పొందుతారు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. అంతక ముందు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇది మంచి సమయం. ఇంకా వ్యాపార ఒప్పందాలు కూడా కుదురుతాయి. మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది.

కుంభ రాశి : బుధుడు వలన వీరి జీవితం మొత్తం మారుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం. అంతేకాదు, కలలో కూడా ఊహించని విధంగా వీరి లైఫ్ ఛేంజ్ అవ్వబోతోంది. అంతేకాదు, ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది. అలాగే కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి. భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.