మామిడికాయలతో గులాబ్ జామ్.. ఎలా చేయాలో తెలుసా?

Updated on: Jun 16, 2026 | 11:11 AM

గులాబ్ జామ్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. చాలా మంది ఇష్టంగా గులాబ్ జామ్ తింటారు. అయితే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా, మామిడికాయలతో గులాబ్ జాబ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుందంట. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

1 / 5
 కావాల్సిన పదార్థాలు : మామిడి పండు, బొంబాయి రవ్వ, నెయ్యి, నూనె, చక్కెర, ఫుడ్ కలర్, యాలకుల పొడి, పాలపొడి. ఈ పదార్థాలతో చాలా తక్కువ సమయంలో టేస్టీ టేస్టీ గులాబ్ జాములు తయారు చేయవచ్చును.

2 / 5
ముందుగా మామిడికాయలను తీసుకోవాలి. ముఖ్యంగా గుజ్జు బాగా ఉన్నవి తీసుకోవాలి. పండ్ల నుంచి గుజ్జును వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వను తీసుకొని దానిని వేయించుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, వన్  టీ స్పూన్ నెయ్యి వేసి , దోరగా వేయించుకోవాలి. తర్వాత దీనిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న మామిడికాయల గుజ్జు తీసుకొని, రవ్వలో వేస్తూ దగ్గరగా కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. దీని వలన గులాబ్ జామ్‌లు బాగా వస్తాయి.

3 / 5
ఇది బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం రెడీ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో కప్పు చక్కెరకు కప్పు నీళ్లు పోసి పాకం వచ్చేలా చేయాలి. మరీ ముదురు పాకం కాకుండా, తీగ పాకం రావాలి. నీరు బాగా మరుగుతున్నప్పుడే యాలకుల పొడి, ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. పాకం వచ్చే లోపు గులాబ్ జామ్‌లు తయారు చేసుకోవాలి.

4 / 5
దీని కోసం మనం పక్కన పెట్టుకున్న మ్యాంగో, రవ్వ మిశ్రమాన్ని తీసుకొని అది గోరు వెచ్చగా ఉన్న సమయంలోనే చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. తర్వాత మరో వైపు స్టవ్ ఆన్ చేసి, డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేయాలి.

5 / 5
నూనె బాగా వేడి అయిన తర్వాత అందులో ఈ గులాబ్ జామ్‌లు వేసి మంచిగా, బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత, మనం పాకం తయారు చేసుకుంటున్నాం, కదా అది కూడా పాకం వచ్చి ఉంటుంది, అప్పుడు అందులో రెండు చుక్కల నిమ్మరసం వేయాలి. తర్వాత దానిలో ఈ వేయించిన గులాబ్ జామ్‌లు వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మామిడికాయ గులాబ్ జామ్‌లు రెడీ.

Follow Us