Year Ender 2022: ఈ ఏడాది నేషనల్ టీమ్ కెప్టెన్ బాధ్యతల నుంచి వైదొలగిన సారథులు వీరే.. లిస్ట్‌లో భారత ఆటగాళ్లు కూడా..

|

Dec 31, 2022 | 5:35 PM

2022 సంవత్సరంలో ప్రపంచ క్రికెట్‌ గణనీయమైన మార్పులను చూసింది. కోహ్లీ సహా అనేక మంది సీనియర్ స్టార్ క్రికెటర్లు తమ జాతీయ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం క్రికెట్ అభిమానులకు షాకిచ్చింది.

1 / 7
2022 సంవత్సరంలో ప్రపంచ క్రికెట్‌ గణనీయమైన మార్పులను చూసింది. కోహ్లీ సహా అనేక మంది సీనియర్ స్టార్ క్రికెటర్లు తమ జాతీయ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం క్రికెట్ అభిమానులకు షాకిచ్చింది. మరి ఎవరెవరు 2022లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సారథుల లిస్ట్‌లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

2 / 7
విరాట్ కోహ్లి (భారత్): 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు సారథ్యం వహించిన కింగ్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తప్పించారు. తర్వాత కేవలం టెస్టు కెప్టెన్సీని మాత్రమే కొనసాగిన కోహ్లి 2022 జనవరి 15న టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి భారత అభిమానులకు షాక్ ఇచ్చాడు.

3 / 7
 కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్): న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లాంటి అత్యుత్తమ స్థాయి కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. అయితే బ్యాటింగ్ వైఫల్యంతో విసిగిపోయిన విలియమ్సన్ డిసెంబర్ 15న టెస్టు కెప్టెన్సీని వదులుకున్నాడు.

4 / 7
జో రూట్ (ఇంగ్లాండ్): జో రూట్‌ను ఇంగ్లండ్ జట్టులో టెస్ట్ స్పెషలిస్ట్‌గా పిలిచేవారు. అయితే  ఈ ఏడాది యాషెస్ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ 4-0తో ఘోర పరాజయం పాలైనప్పుడు ఏప్రిల్ 15న ఆండ్రీ రూట్ టెస్ట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు.

5 / 7
ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్): ఇంగ్లండ్‌కు వన్డే ప్రపంచకప్ అందించిన ఆ టీమ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గత కొంతకాలంగా ఫామ్‌ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆ క్రమంలోనే జూన్ 28న మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో మోర్గాన్ వైట్‌బాల్ క్రికెట్ కెప్టెన్సీని కూడా ముగించాడు.

6 / 7
 ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా): విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆరోన్ ఫించ్ సెప్టెంబర్ 10న వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఫించ్ వన్డే కెప్టెన్సీకి ముగింపు పలకాల్సి వచ్చింది. అయితే ఆసీస్ టీ20 జట్టుకు ఫించ్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

7 / 7
మిథాలీ రాజ్ (భారత్): భారత మహిళల వన్డే, టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన మిథాలీ రాజ్ ఈ ఏడాది జూన్ 8న అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. తద్వారా భారత జట్టు కెప్టెన్సీ హర్మన్‌ప్రీత్ కౌర్ భుజాలపై ఉంది.