
ఆకారం, రంగు: మార్కెట్‌లో మనకు రెండు రకాల నిమ్మకాయలు దొరుకుతాయి. ఒకటి నిమ్మకాయ, మరోటి నిమ్మపండు.. నిమ్మకాయతో పోల్చుకుంటే నిమ్మపండు పరిమాణంలో కాస్త పెద్దగా గుండ్రంగా కనిపిస్తుంది. చూడ్డానికి ఇది పసుపు రంగులో ఉంటుంది. అదే నిమ్మకాయ విషయానికి వస్తే.. ఇది సైజులో చిన్నగా ఉండడంతో పాటు చూడ్డానికి ఆకుపచ్చ వర్ణంలో ఉండి గుడ్రంగా ఉంటంటుంది.

రుచి, రంగు : వీటి రంగుతో పాటు రుచిలో కూడా తేడాలు ఉంటాయి. నిమ్మపండు రుచికి కాస్త పులుపుతో పాటు కొద్దిగా తీపిదనం కలిగి ఉంటుంది. కాబట్టి దీని రుచి చాలా సాఫ్ట్‌గా, ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ నిమ్మకాయ మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. పండుతో పోలిస్తే కాయలో పులుపుదనం చాలా తీవ్రంగా, కారంగా ఉంటుంది. నిమ్మపండు వాసన కాస్త సాఫ్ట్‌గా పూల వాసనను పోలి ఉండి మనస్సుకు హాయినిస్తుంది. కానీ నిమ్మకాయ వాసన మాత్రం చాలా స్ట్రాంగ్‌గా, ఘాటుగా ఉంటుంది. దూరం నుంచే దీని వాసనను సులభంగా పసిగట్టవచ్చు.

వంటల్లో వీటి వినియోగం: నిమ్మపండు మైల్డ్ రుచిని కలిగి ఉంటుంది. కాబట్టి వీటిని బేకింగ్ ఐటమ్స్ కేకులు, కుకీలు,నిమ్మరసం శర్బత్, లెమన్ టీ, లైట్ సలాడ్ డ్రెస్సింగ్స్, చేపల వంటకాల్లో ఫ్లేవర్ పెంచడానికి వాడుకోవచ్చు. ఇక నిమ్మకాయ ఘాటైన పులుపును కలిగి ఉంఉంది కాబట్టి వీటిని ఎక్కవగా ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ , మెక్సికన్ టాకోస్, సల్సా, థాయ్ కర్రీలు, నాన్‌వెజ్ మ్యారినేషన్, వివిధ రకాల కాక్‌టెయిల్స్, మాక్‌టెయిల్స్‌లో వాడుకోవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు : ఆకారం, రుచిలో తేడాలు ఉన్నప్పటికీ, ఆరోగ్య పరంగా ఈ రెండు సైట్రస్ జాతి పండ్లలోనూ సమానమైన పోషక గుణాలు ఉన్నాయి. రెండింటిలోనూ విటమిన్-సి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. ఈ రెండింటిలోనూ తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి శరీరంలో జీవక్రియలను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడతాయి.

అలాగే ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే, వంట చేసేటప్పుడు అందుబాటులో ఉన్నదాన్ని బట్టి ఒకదానికి బదులు మరొకటి వాడినా.. మీరు వంటకం అసలైన, ఖచ్చితమైన రుచిని ఆస్వాదించాలంటే మాత్రం సరైన నిమ్మకాయను ఎంచుకోవడమే బెస్ట్ ఆప్షన్.