
చాలా మంది రాత్రికి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే పారేస్తూ ఉంటారు. అలా మిగిలిన అన్నం పారేయడానికి చాలా వరకు ఎవరికీ ధైర్యం రాదు. అయినా పడేస్తుంటారు. కానీ ఇలా మిగిలిన అన్నాన్ని బయట వేయాల్సిన పనేలేదంట. దాంతో నోరూరించే టేస్టీ స్నాక్ తయారు చేసుకవచ్చునంట.ఇంతకీ అది ఏమిటి అనుకుంటున్నారా? కట్లేట్.

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కట్లెట్ ఎంతో ఇష్టంగా తింటారు. మరి దీనిని మిగిలిన అన్నంతో ఇలా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందంట. అంతే కాకుండా చేయడం చాలా సులభం ఖర్చు కూడా తక్కువే. చాలా రుచిగా ఉండటం వలన పిల్లలే కాదండోయ్, పెద్దలు కూడా ఇష్టంగా తింటారంట. మరి దీనిని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం.

కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ఒకటిన్నర కప్పు మిగిలిన అన్నం, ఒక ఉడికించిన బంగాళదుంప, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కరివేపాకు, అర టీస్పూన్ కారం, పావు టీస్పూన్ గరం మసాలా, రుచికి తగ్గ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల బ్రెడ్ క్రంబ్స్ లేదా బొంబాయి రవ్వ, వేయించడానికి నూనె,కావాలంటే క్యారెట్, బీన్స్, క్యాప్సికం లాంటి కూరగాయలు కూడా వేసుకోవచ్చు.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా మిగిలిన అన్నాన్ని మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఉడికించిన బంగాళదుంపను వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ , పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసి కట్లెట్ ఆకారంలో ఒత్తుకోవాలి.

ఇప్పుడు వాటిని వేయించుకోవడానికి, స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి మీడియం మంటపై కట్లెట్స్ ను రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేదా హెల్దీగా కావాలంటే 180 డిగ్రీల వద్ద ఎయిర్ ఫ్రైయర్ లో 12-15 నిమిషాలు కాల్చుకోవచ్చు. అంతే టేస్టీ టేస్టీ వేడి వేడి కట్లేట్స్ రెడీ. మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి.