Bendakaya Royyala Pulusu: ప్రభాస్ ఫేవరెట్ కోనసీమ స్పెషల్ బెండకాయ రొయ్యల పులుసు..

Updated on: Oct 22, 2026 | 5:40 PM

గోదావరి, కోనసీమ ప్రాంతాల సీఫుడ్ వంటకాల్లో రొయ్యలతో రకరకాల కూరలు, వేపుళ్లు వండుతుంటారు. అయితే రొయ్యలకు బెండకాయ కలయికతో చేసే 'బెండకాయ రొయ్యల పులుసు' రుచి మాత్రం సాటిలేనిది. హీరో ప్రభాస్ ద్వారా ఇంటర్నెట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ వంటకం ప్రతి తెలుగింటి భోజనంలోనూ అమృతతుల్యంగా అనిపిస్తుంది. సాధారణంగా రొయ్యలు ఎక్కువగా వేగితే రబ్బరులా గట్టిపడిపోతాయనే భయం ఉంటుంది. 

1 / 5
కావలసిన పదార్థాలు: 200 గ్రాములు శుభ్రం చేసిన న్న రొయ్యలు, 150 గ్రాముల లేత బెండకాయ ముక్కలు, 1 మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 
3 సన్నగా తరిగిన బాగా పండిన టమాటాలు, పావు కప్పు చింతపండు రసం, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, పావు టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 నుండి 1¼ టేబుల్ స్పూన్ల కారం పొడి, పావు టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 2 తుంచిన ఎండు మిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, ⅓ కప్పు వేడి నీళ్లు,  కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు, 5 నుండి 6 టేబుల్ స్పూన్ల వంట నూనె

కావలసిన పదార్థాలు: 200 గ్రాములు శుభ్రం చేసిన న్న రొయ్యలు, 150 గ్రాముల లేత బెండకాయ ముక్కలు, 1 మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు,  3 సన్నగా తరిగిన బాగా పండిన టమాటాలు, పావు కప్పు చింతపండు రసం, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, పావు టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 నుండి 1¼ టేబుల్ స్పూన్ల కారం పొడి, పావు టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 2 తుంచిన ఎండు మిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, ⅓ కప్పు వేడి నీళ్లు,  కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు, 5 నుండి 6 టేబుల్ స్పూన్ల వంట నూనె

2 / 5
తయారీ విధానం: స్టవ్‌పై పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత 150 గ్రాముల లేత బెండకాయ ముక్కలు (1 అంగుళం సైజు), కొద్దిగా ఉప్పు వేయాలి. మీడియం మంటపై గరిటెతో కలుపుతూ బెండకాయ ముక్కలపై నల్లటి మచ్చలు ఏర్పడేంత వరకు వేయించాలి. ఇలా వేపడం వల్ల బెండకాయలోని జిగురు పూర్తిగా పోతుంది; ఇప్పుడు వీటిని బౌల్‌లోకి తీసుకుని పక్కన ఉంచాలి.

3 / 5
అదే పాన్‌లో 5 నుండి 6 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగాక పావు టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, తుంచిన 2 ఎండుమిర్చి ముక్కలు వేసి ఎండుమిర్చి నల్లబడే వరకు వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ మెత్తబడి పింక్ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఆపై 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 నుండి 1¼ టేబుల్ స్పూన్ల కారం మరియు ⅓ కప్పు నీరు పోసి మసాలాలు మాడకుండా నూనె పైకి తేలే వరకు వేయించాలి.

4 / 5
మసాలాలోంచి నూనె తేలిన తర్వాత.. శుభ్రం చేసిన 200 గ్రాముల చిన్న రొయ్యలు, సన్నగా తరిగిన 3 పండిన టమాటాలు వేసి నాలుగు వైపులా బాగా కలపాలి. రొయ్యలు, టమాటాల నుంచి వచ్చే సహజ నీటితోనే రొయ్యలు రబ్బరులా అవ్వకుండా సాఫ్ట్‌గా, జ్యూసీగా మగ్గుతాయి. టమాటాలు పూర్తిగా గుజ్జులా మారి నూనె తేలే వరకు వేయించాలి. నూనె తేలాక పావు కప్పు చింతపండు రసం పోసి ఒక ఉడుకు రానివ్వాలి.

5 / 5
తర్వాత ముప్పావు కప్పు మరిగే వేడి నీళ్లు, ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి కలపాలి. మూతపెట్టి మీడియం మంటపై పులుసు దగ్గరపడి అంచుల వెంట నూనె పైకి తేలేంత వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి, ఉప్పు కారాలు సరిచూసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.అంతే, నోరూరించే కోనసీమ స్పెషల్ 'బెండకాయ రొయ్యల పులుసు' సిద్ధం! పొగలు కక్కే వేడివేడి అన్నంలో ఈ పులుసు, రొయ్యలు, బెండకాయ ముక్కలు వేసుకుని కలుపుకుని తింటుంటే మరే ఇతర కూరా అవసరం లేనంత కమ్మటి రుచితో ఉంటుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us