
ఇంట్లో కిచెన్ శుభ్రం చేయడం పెద్ద కష్టం. ఎందుకంటే, ఈ గదిలో ఆహార పదార్థాలు, వంట నూనెలు, డబ్బాలు , పెద్ద పెద్ద పాత్రలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే, ఇదే సమయంలో ఆహార పదార్థాలు కింద పడుతుంటాయి. అప్పుడు చీమలు, బొద్దింకలు, పురుగులు వస్తాయి.

ఇక బొద్దింకలు, పురుగులు అయితే కనిపించకుండా దాగి ఉంటాయి. ఇలాంటి వాటిని తరిమికొట్టడం చాలా కష్టం. అయితే, ఈ నేచురల్ హోమ్ టిప్స్ తో కీటకాలు రాకుండా తరిమికొట్టచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతి ఇంట్లో ఉల్లి, వంట సోడాతో ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలకు బేకింగ్ సోడాను కలిపి కీటకాలు ఉన్నచోట దీనిని వేయాలి. ఉల్లిపాయ కీటకాలను దగ్గరికి వచ్చేలా చేసి, బేకింగ్ సోడాను వాటిని అంతం చేస్తుంది. ఈ హోమ్ రెమెడీ బాగా పని చేస్తుంది. అయితే, ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను కలుపుకోవాలి. అవసరమైతే దీనిలో కొద్దిగా పంచదారను కూడా వేసుకోవాలి. ఇది కీటకాలను బాగా ఆకర్షిస్తుంది. వీటిని బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఉన్న చోట ఉంచాలి. సింక్, డస్ట్‌బిన్, ఆహారం పడే చోట పెడితే మంచి ఫలితం ఉంటుంది.

పురుగులు ఆహారం కోసం వెతుకుతూ వంటగదిలో నక్కి ఉంటాయి. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ వాసన.. పురుగులను వెంటనే ఆకర్షిస్తుంది. ఆ సమయంలో వీటిలో కలిపిన బేకింగ్ సోడా పురుగులను చంపేస్తుంది.