Kitchen Hacks: ప్రెజర్‌ కుక్కర్‌ వాడేటప్పుడు ఈ తప్పులు మీరూ చేస్తున్నారా? జాగ్రత్త..

|

Oct 02, 2023 | 8:31 PM

రోజువారీ వంట చేయడానికి గృహిణులు ప్రెజర్ కుక్కర్‌ వినియోగిస్తుంటారు. ప్రెజర్ కుక్కర్ వంట చేయడం చాలా సులభం చేస్తుంది. తక్కువ సమయంలో వంట పూర్తవుతుంది. అయితే కొందరు ప్రెజర్ కుక్కర్‌లో పప్పు, బియ్యం మాత్రమే కాకుండా పలురకాల పదార్థాలను సైతం ఉడికిస్తుంటారు. అలాగే చికెన్‌, మటన్‌ వండడానికి, కేక్‌ల తయారీకి కూడా ప్రెషర్‌ కుక్కర్లు వాడుతుంటారు. కానీ ప్రెషర్ కుక్కర్లు సక్రమంగా ఉపయోగించకపోతే ప్రమాదాలు సంభవిస్తాయి. ఒక్కోసారి ప్రెషర్ కుక్కర్లు పేలి మరణానికి..

1 / 5
రోజువారీ వంట చేయడానికి గృహిణులు ప్రెజర్ కుక్కర్‌ వినియోగిస్తుంటారు. ప్రెజర్ కుక్కర్ వంట చేయడం చాలా సులభం చేస్తుంది. తక్కువ సమయంలో వంట పూర్తవుతుంది. అయితే కొందరు ప్రెజర్ కుక్కర్‌లో పప్పు, బియ్యం మాత్రమే కాకుండా పలురకాల పదార్థాలను సైతం ఉడికిస్తుంటారు. అలాగే చికెన్‌, మటన్‌ వండడానికి, కేక్‌ల తయారీకి కూడా ప్రెషర్‌ కుక్కర్లు వాడుతుంటారు.

2 / 5
కానీ ప్రెషర్ కుక్కర్లు సక్రమంగా ఉపయోగించకపోతే ప్రమాదాలు సంభవిస్తాయి. ఒక్కోసారి ప్రెషర్ కుక్కర్లు పేలి మరణానికి కూడా కారణమవుతుంటాయి. అందుకే ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించే సరైన పద్ధతులు తప్పనిసరిగా తెలుసుకోవడం అవసరం. ప్రెజర్ కుక్కర్ మూతలో రబ్బరు రింగ్ ఉంటుంది. దీనినే రబ్బరు పట్టీ అని పిలుస్తారు. కుక్కర్‌ను గ్యాస్‌పై ఉంచే ముందు, ఈ రబ్బరు పట్టీ మూతకు సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి. రోజువారీ వంట కోసం ప్రెజర్ కుక్కర్‌ని ఉపయోగిస్తే గ్యాస్‌కెట్‌ను మర్చిపోకుండా శుభ్రం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఈ రబ్బరు పట్టీని మర్చుకుంటూ ఉండాలి.

3 / 5
ప్రెజర్ కుక్కర్‌ను ఆహార పదార్ధాలతో నిండుగా నింపకూడదు. మూడింట రెండు వంతుల ఆహారం లేదా సగ భాగం మాత్రమే నింపాలి. అలాగే ప్రెషర్ కుక్కర్ మూతను తగినవిధంగా సక్రమంగా పెట్టుకోవాలి. ఎక్కువ ఆహారం ఉంచినా, అతి తక్కువ నీళ్లతో ఉడికించినా ప్రెషర్ కుక్కర్ సరిగ్గా పనిచేయదు. పైగా తక్కువ నీళ్లు ఉంటే ఆహారం సరిగ్గా ఉడకదు కూడా.

4 / 5
చాలా మంది ప్రజలు నూనె లేకుండా ఆహారాన్ని వండడానికి ప్రెజర్ కుక్కర్‌లను ఎంచుకుంటారు. కానీ ప్రెషర్ కుక్కర్‌లో కూడా కొన్ని చుక్కలు నూనె వేసుకోవాలి. లేకపోతే మీ ప్రెజర్ కుక్కర్ త్వరగా పాడైపోతుంది. లేదంటే మూతకు ఉండే రబ్బరు పట్టీ దెబ్బతింటుంది.

5 / 5
ఉడికిన వెంటనే ప్రెషర్ కుక్కర్ మూత తెరవకూడదు. ప్రెజర్ కుక్కర్‌లోని సిటీ బజర్‌ వద్ద స్పూన్‌ లేదా కర్ర సహాయంతో మొత్తం ఆవిరిని బయటకు తీసిన తర్వాత మాత్రమే ప్రెజర్ కుక్కర్ మూత తెరవాలి. ఐదు నిమిషాలు వేచి పక్కన ఉంచుకుని మూత మీద నీళ్లుపోసిన తర్వాత మూత తెరవడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ప్రెషర్ కుక్కర్ పేలడం జరగదు.