గ్యాస్ సమస్య ఉన్నా ఇబ్బంది లేకుండా హ్యాపీగా తినగలిగే జొన్నపిండి పకోడీలు..

Updated on: Nov 27, 2026 | 9:48 AM

సాయంత్రం వేళల్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే పకోడీలను మరింత రుచికరంగా, ఆరోగ్యకరంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.. సాధారణంగా శెనగపిండితో చేసే పకోడీల కంటే, జొన్నపిండిని ఉపయోగించి చేసే పకోడీలు మంచి రుచిని అందిస్తాయి. గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్నవారు కూడా ఎటువంటి భయం లేకుండా ఈ పకోడీలను హాయిగా తినవచ్చు.

1 / 5
ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని, దానిలో కట్ చేసి పెట్టుకున్ ఉల్లిపాయ ముక్కలు కూడా దీనిలో వేయాలి. ఇంకా దీనిలో  రుచికి సరిపడా ఉప్పు వేసి, ఉల్లిపాయలను రెండు మూడు నిమిషాల పాటు వీటిని కలపాలి. ఇలా చేయడం వలన ఉల్లిపాయల్లోని నీరంతా బయటకు వచ్చి, పకోడీ పిండి కలపడానికి తక్కువ నీళ్లు పడతాయి. ఇక ఇప్పుడు ఉల్లిపాయ మిశ్రమంలో దీనిని తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, రుచికి సరిపడా కారం  వేసి బాగా కలపాలి.

2 / 5
ఈ మిశ్రమంలో ఒక కప్పు శెనగపిండి, ఒకటిన్నర కప్పు జొన్నపిండిని వేసి బాగా కలపాలి. ఇక్కడ ఉపయోగించిన జొన్నపిండి ఇంట్లో మరాడించినది కాబట్టి మరింత క్రంచీగా ఉంటుంది, అయితే షాపుల్లో దొరికే జొన్నపిండితో కూడా చేసుకోవచ్చు. ఆ తరువాత, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. సుమారు ఒక కప్పు లోపే నీళ్లు అవసరం పడతాయి. పిండిని గట్టిగా కలిపితే పకోడీలు మరింత కరకరలాడుతూ వస్తాయి. ఒకవేళ సాఫ్ట్‌గా కావాలనుకుంటే, కొద్దిగా ఎక్కువ నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవచ్చు. ఈ దశలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి.

3 / 5
పకోడీలు వేయించడానికి సరిపడా నూనెను ఒక పాన్ లో  వేసి బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్‌కు అడ్జస్ట్ చేసుకోవాలి. తరువాత, సిద్ధం చేసుకున్న పకోడీ మిశ్రమాన్ని చిన్న చిన్నగా నూనెలో వేయాలి. కడాయికి సరిపడినన్ని పకోడీలు మాత్రమే వేయాలి, మరీ ఎక్కువ వేస్తే సరిగ్గా వేగవు.

4 / 5

పకోడీలను మీడియం మంటపైనే గోధుమ రంగులోకి మారేంత వరకు, కరకరలాడేంత వరకు వేయించాలి. హై ఫ్లేమ్‌లో వేయిస్తే బయట కాలిపోయి లోపల పచ్చిగా ఉంటాయి. కాసేపటికి మంచి రంగు వచ్చి, క్రిస్పీగా మారినప్పుడు నూనె నుండి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పకోడీలు నూనెను అస్సలు పీల్చవు కాబట్టి, టిష్యూ పేపర్ అవసరం ఉండదు. చివరగా, కొద్దిగా కరివేపాకును నూనెలో వేయించి, పకోడీల పైన చల్లుకుంటే అదనపు రుచి, సువాసన వస్తాయి.

5 / 5
ఈ జొన్నపిండి పకోడీలు చల్లారిన తర్వాత కూడా చాలాసేపటి వరకు కరకరలాడుతూ ఉంటాయి. శెనగపిండితో చేసే పకోడీలు తరచుగా నూనెను పీల్చి, త్వరగా మెత్తబడతాయి, కానీ జొన్నపిండి పకోడీలకు ఈ సమస్య ఉండదు. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు ఎటువంటి భయం లేకుండా వీటిని తినొచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us