
కానీ మన వంటింట్లో మిగిలిపోయిన లేదా పాచిపోయిన అన్నంతో ఒక అద్భువమైన ఉచిత ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేసి మొక్కకు అందిస్తే, ఏ సీజన్ లోనైనా మల్లె మొక్క విపరీతంగా మల్లెపూలతో విరబూస్తుంది. ఈ అద్భుతమైన కిచెన్ వేస్ట్ ఫెర్టిలైజర్ చిట్కాలను పాటిస్తే మీ ఇంట్లోని మల్లె మొక్క గుబురుగా పెరగడమే కాకుండా తెల్లటి రోజా పువ్వుల సైజులో పెద్ద పెద్ద మల్లెపూలు పూయడం ఖాయం.

ఈ సహజ సిద్ధమైన ద్రావణ ఎరువు తయారీ కోసం మనం కిచెన్ లో మిగిలిపోయిన ఒక పిడికెడు తెల్ల అన్నాన్ని తీసుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉప్పు, నూనె లేదా మసాలాలు కలిపిన అన్నాన్ని ఈ ఫెర్టిలైజర్ కు అస్సలు ఉపయోగించకూడదు. కేవలం సాదా అన్నాన్ని మాత్రమే వాడాలి. ఈ పిడికెడు అన్నానికి కొద్దిగా పుల్లటి మజ్జిగను జోడించాలి.

ఇందుకు అన్నాన్ని చేత్తో బాగా మెత్తగా మెదిపి, అందులో నాలుగు ఐదు రోజుల పాటు బాగా పులియబెట్టిన పుల్లటి మజ్జిగను పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలో పోసి మూత పెట్టి మరో నాలుగు ఐదు రోజుల పాటు నీడలో బాగా పులియబెట్టాలి. ఇలా పులియబెట్టడం వల్ల అందులో మొక్కలకు మేలు చేసే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వంటి ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు విపరీతంగా వృద్ధి చెందుతాయి.

నాలుగు రోజుల తర్వాత ఈ ఒక లీటరు పులిసిన అన్నం ద్రావణానికి పది లీటర్ల సాధారణ నీటిని కలిపి బాగా పలుచగా చేసుకోవాలి. ఈ శక్తివంతమైన లిక్విడ్ ఫెర్టిలైజర్‌ను ఉపయోగించే ముందు మల్లె మొక్క కుండీలోని పై మట్టి లేయర్ ను ఒక చిన్న టూల్ సహాయంతో మెల్లగా కదిలించాలి. ఇలా చేయడం వల్ల మట్టిలో ఉండే కలుపు మొక్కలు తొలగిపోవడమే కాకుండా వేర్లకు గాలి, వెలుతురు చక్కగా అందుతాయి. ఇప్పుడు మొక్క మొదట్లో తగినన్ని నీళ్లు పోసి, ఆ తర్వాత ఈ తయారు చేసుకున్న అన్నం మజ్జిగ ద్రావణాన్ని వేరు వ్యవస్థకు బాగా అందేలా పోయాలి. అలాగే ఈ లిక్విడ్ ను ఒక స్ప్రే బాటిల్ లో పోసి ఆకులపై కూడా బాగా స్ప్రే చేసుకోవచ్చు.

ఈ జీవామృతాన్ని మీ మల్లె మొక్కకు అందించడం వల్ల వేరు వ్యవస్థ ఎంతో బలంగా మారుతుంది. మట్టి సారవంతంగా మారి మొక్కకు కావలసిన తేమను నిలుపుకునే సహజ శక్తి పెరుగుతుంది. ఆకులు పచ్చగా మారి గుత్తులుగా మొగ్గలు రావడం ప్రారంభమవుతుంది. ఈ ఫెర్టిలైజర్‌ను గులాబీ, మందార, కనకాంబరాలు వంటి పూల మొక్కలకు ఇవ్వవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండా సంపూర్ణ ఆర్గానిక్ పద్ధతిలో మీ గార్డెన్‌ను అందమైన పూలతో నింపుకోవడానికి ఈ సులభమైన కిచెన్ చిట్కాలను అస్సలు మిస్ కాకుండా మీ ఇంట్లోనే తయారు చేసుకుని ఆనందంగా ఆస్వాదించండి.