ఏసీ వాడే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే నష్టపోవడం పక్కా..

Updated on: Mar 13, 2026 | 5:18 PM

AC Tips: భానుడు భగభగమంటున్నాడు. మార్చి నెలలోనే ఏప్రిల్, మే నెలల వేడి కనిపిస్తుండటంతో సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఎండల దెబ్బకు చాలా ఇళ్లలో ఏసీలు విరామం లేకుండా తిరుగుతున్నాయి. అయితే ఏసీని ఇలా గంటల తరబడి నిరంతరం నడపడం సురక్షితమేనా..? అసలు ఏసీ లైఫ్ పెరగాలంటే ఏం చేయాలి? దీనిపై నిపుణులు ఏమంటున్నారు అనేది తెలుసుకుందాం.

1 / 5
నిరంతరం నడపొచ్చా: ఆధునిక సాంకేతికతతో వస్తున్న ఏసీలు ఎక్కువ కాలం వచ్చేలాగే తయారవుతాయి. మీ ఏసీ కండిషన్ బాగుండి.. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తే చాలా గంటలు వాడినా ప్రమాదం ఏమీ లేదు. కానీ ఏదైనా యంత్రానికి విశ్రాంతి అవసరమని గుర్తుంచుకోవాలి.

2 / 5
ఎన్ని గంటలు వాడితే సేఫ్: సాధారణంగా ఏసీని నిరంతరాయంగా 8 నుండి 12 గంటల పాటు నడపడం ఉత్తమం. రాత్రంతా వాడినా పెద్దగా సమస్య ఉండదు. కానీ 24 గంటల పాటు ఆపకుండా నడిపితే మాత్రం మెషీన్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా గదిలో గాలి సరిగ్గా ఆడే అవకాశం లేకపోతే ఏసీ త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది.

3 / 5
16 డిగ్రీలా? 24 డిగ్రీలా: చాలా మంది ఏసీ ఆన్ చేయగానే 16 లేదా 18 డిగ్రీలకు సెట్ చేస్తారు. దీనివల్ల కంప్రెసర్ మీద లోడ్ పెరిగి కరెంట్ బిల్లు మోత మోగుతుంది. నిపుణుల సూచన ప్రకారం.. 24 నుండి 26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంచడం వల్ల గది హాయిగా ఉంటుంది. విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా తగ్గుతుంది.

4 / 5
గదిని సీల్ చేయండి: ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు తలుపులు, కిటికీలు పదే పదే తీయకూడదు. ఇలా చేయడం వల్ల చల్లని గాలి బయటకు వెళ్లిపోయి, గదిని మళ్ళీ చల్లబరచడానికి ఏసీ మరింత కష్టపడాల్సి వస్తుంది. ఇది మీ కరెంట్ బిల్లును పెంచడమే కాకుండా యంత్రం జీవితకాలాన్ని తగ్గిస్తుంది.

5 / 5
ఫిల్టర్ల శుభ్రత ముఖ్యం:  ఏసీ ఫిల్టర్లలో ధూళి పేరుకుపోతే గాలి సరిగ్గా రాదు. దీనివల్ల ఏసీ ఎక్కువ సేపు నడిచినా చల్లదనం అనిపించదు. అందుకే క్రమం తప్పకుండా ఫిల్టర్లను శుభ్రం చేసుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ఏసీ కాలకాలం ఉంటుంది.. మీ జేబుకు చిల్లు పడకుండా ఉంటుంది.

Follow Us