రోజూ నిమ్మకాయ నీళ్లు తాగితే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి..

Updated on: Jun 05, 2026 | 6:54 AM

నేటి ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. ఈ క్రమంలోనే చాలామంది కృత్రిమ డ్రింక్స్‌ను పక్కనపెట్టి సహజసిద్ధమైన అలవాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో అందరికీ ముందస్తుగా గుర్తొచ్చేది.. నిమ్మరసం. సోషల్ మీడియాలో దీనిని ఒక మిరాకిల్ డ్రింక్‌గా, ఫ్యాట్ బర్నర్‌గా, డిటాక్స్ డ్రింక్‌గా అభివర్ణిస్తున్నారు. అయితే నిజంగానే నిమ్మరసం బరువును తగ్గించేస్తుందా? రోజూ నిమ్మరసం తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? తెలుసుకుందాం..

1 / 5
నిమ్మకాయ.. విటమిన్-సి కి కేరాఫ్ అడ్రస్. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, సిట్రిక్ యాసిడ్ శరీరానికి మేలు చేస్తాయనేది వంద శాతం నిజం. శరీరానికి అవసరమైన కొన్ని మైక్రో న్యూట్రియెంట్స్ దీని ద్వారా అందుతాయి. ముఖ్యంగా రోజూ సరిగ్గా నీళ్లు తాగని వారికి, నిమ్మరసం ఒక బూస్టర్‌లా పనిచేస్తుంది. బాడీని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.

2 / 5
నిమ్మకాయలోని ఆమ్ల గుణాలు పొట్టలోని జీర్ణరసాలను ఉత్తేజపరుస్తాయి. దీనివల్ల ఆహారం సులభంగా అరిగి.. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ మూత్రంలో ఉండే ఖనిజాలను కరిగించడానికి సహాయపడుతుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.

3 / 5
బరువు తగ్గడం: చాలామంది నిమ్మరసం తాగితే ఫ్యాట్ కరిగిపోతుందని అనుకుంటారు. కానీ నిజానికి, చక్కెరతో కూడిన కూల్ డ్రింక్స్ లేదా ఆర్టిఫిషియల్ జ్యూస్‌ల స్థానంలో నిమ్మరసాన్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవడం వల్ల.. శరీరంలోకి క్యాలరీల లభ్యత తగ్గి, బరువు తగ్గడానికి పరోక్షంగా సాయపడుతుందే తప్ప.. నిమ్మరసం ఫ్యాట్‌ను నేరుగా కరిగించలేదు.

4 / 5
సైడ్ ఎఫెక్ట్స్: ఏదైనా మితిమీరితే ప్రమాదమే. నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల కొన్ని తీవ్రమైన నష్టాలు ఉన్నాయి. నిమ్మకాయలో యాసిడ్ కంటెంట్ ఎక్కువ. రోజూ ఎక్కువగా నిమ్మరసం తాగడం వల్ల దంతాల పైపొర అరిగిపోతుంది. ఫలితంగా దంతాల సెన్సిటివిటీ పెరిగి.. చల్లని లేదా వేడి పదార్థాలు తిన్నప్పుడు పళ్లు జివ్వుమంటాయి. గ్యాస్ట్రిక్ లేదా GERD సమస్యలతో బాధపడేవారు పరగడుపున స్ట్రాంగ్ నిమ్మరసం తాగితే.. కడుపులో మంట, అసౌకర్యం మరింత ఎక్కువవుతాయి. సిట్రస్ ఫలాలు పడని కొందరిలో చర్మంపై దద్దుర్లు, దురద వంటి అలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు.

5 / 5
సరైన పద్ధతి ఏంటి: నిమ్మరసం వల్ల నష్టాలు జరగకుండా, పూర్తి లాభాలు పొందాలంటే ఆరోగ్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. ఒక గ్లాసు నీటిలో అర చెక్క నిమ్మరసం మాత్రమే పిండుకోవాలి. అంతకంటే ఎక్కువ వాడకూడదు. నిమ్మరసం నేరుగా దంతాలకు తగలకుండా స్ట్రా ద్వారా తాగడం వల్ల దంతాల ఎనామెల్‌ను కాపాడుకోవచ్చు. నిమ్మరసం తాగిన వెంటనే సాదా నీటితో నోటిని బాగా పుక్కిలించి ఉమ్మేయాలి. నిమ్మరసాన్ని కేవలం ఒక ఫ్యాట్ బర్నర్‌గా చూడటం తప్పు. సరైన సమతుల్య ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం ఉన్నప్పుడే ఇది ఒక మంచి హెల్త్ సప్లిమెంట్‌గా ఉపయోగపడుతుంది.

Follow Us