ఫాస్ట్‌ఫుడ్‌లో వాడే ఈ సాల్ట్ ఎంత ప్రమాదమో తెలుసా..? దీనివల్ల కలిగే ప్రమాదకరమైన దుష్ప్రభావాలు ఇవే!

Updated on: Jul 04, 2026 | 8:38 AM

నేటి ఆధునిక జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడం ఒక అలవాటుగా మారిపోయింది. నూడుల్స్, ఫ్రైడ్ రైస్, సూప్స్‌, మంచూరియా వంటి చైనీస్ వంటకాలకు ఆ ప్రత్యేకమైన కరకరలాడే రుచిని, మంచి సువాసనను అందించడానికి ఒక ప్రత్యేకమైన సాల్ట్‌ను ఉపయోగిస్తారు. దానినే మనం అజినోమోటో లేదా చైనా ఉప్పు అంటాం. సైంటిఫిక్ భాషలో దీనిని మోనోసోడియం గ్లూటామేట్ (MSG) అంటారు. అయితే, అజినోమోటో తింటే హార్ట్ ఎటాక్ వస్తుందని, బీపీ పెరుగుతుందని, మెదడు పాడవుతుందనే ప్రచారాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అసలు అజినోమోటో నిజంగానే అంత ప్రమాదకరమా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
నాడీ వ్యవస్థ, మెదడుపై ప్రభావం: చైనీస్ వంటకాల్లో వాడే అజినోమోటో మానవ నాడీ వ్యవస్థను (Nervous System) తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇందులోని గ్లుటామిక్ యాసిడ్ మెదడులో సమాచారాన్ని చేరవేసే న్యూరోట్రాన్స్‌మిటర్‌గా పనిచేస్తుంది. మనం తింటున్న ఆహారం ద్వారా ఈ యాసిడ్ శరీరంలో విపరీతంగా ఎక్కువైతే, అది మెదడు పనితీరును దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 / 5
విపరీతమైన ఆకలి, ఊబకాయం: అజినోమోటోకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఇది నాలుకపై ఉండే రుచి గ్రంథులను ఉత్తేజపరచడమే కాకుండా, మన ఆకలిని విపరీతంగా పెంచుతుంది. దీనివల్ల కడుపు నిండినప్పటికీ మళ్లీ మళ్లీ తినాలనే కోరిక కలుగుతుంది. ఇలా పదే పదే జంక్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగిపోయి, వేగంగా బరువు పెరగడం, ఊబకాయం (Obesity) వంటి సమస్యలు వస్తాయి.

3 / 5
మైగ్రేన్ తలనొప్పి, నిద్రలేమి: మీకు తరచూ నిద్ర సరిగ్గా పట్టకపోవడం లేదా తీవ్రమైన తలనొప్పి (Migraine) వస్తుంటే.. దానికి మీరు తినే ఆహారంలోని అజినోమోటో కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. ఇది నరాలపై ఒత్తిడిని పెంచి నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది.

4 / 5
గర్భిణీ స్త్రీలకు తీవ్ర ప్రమాదం: గర్భిణీ స్త్రీలు అజినోమోటో లేదా చైనీస్ ఆహారాలను వీలైనంత వరకు అస్సలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది గర్భంలోని శిశువు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇది తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి మంచిది కాదు.

5 / 5
అధిక రక్తపోటు (High BP): మీరు ఇప్పటికే బీపీ లేదా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే, అజినోమోటో ఉన్న ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇందులో సోడియం పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల, ఇది శరీరంలో రక్తపోటు స్థాయిలను అకస్మాత్తుగా పెంచి ప్రాణాంతక పరిస్థితిని తెచ్చిపెడుతుంది. బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇన్స్టంట్ నూడుల్స్ కొనేటప్పుడు లేబుల్‌పై 'MSG' లేదా 'Monosodium Glutamate' ఉందో లేదో గమనించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.

Follow Us