
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఐదుగురు విదేశీ ఆటగాళ్లు వీరే

క్రిస్ మోరిస్: క్రిస్ మోరిస్ ప్రస్తుత ఐపీఎల్‌లో ఆడడం లేదు. అతను గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో మోరీస్ మొత్తం 9 సార్లు డకౌట్ అయ్యాడు

AB డివిలియర్స్: ఈ ప్రొటీస్ స్టార్ క్రికెటర్ కూడా ప్రస్తుత ఐపీఎల్‌లో ఆడడం లేదు. బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన అతను 10 సార్లు సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు.

సునీల్ నరైన్: ఈ కరీబియన్ స్టార్ క్రికెటర్ ప్రస్తుతం కేకేఆర్ తరఫున ఆడుతున్నాడు. అతను కూడా మొత్తం 10 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.

రషీద్ ఖాన్: ప్రస్తుత ఐపీఎల్‌లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు రషీద్ ఖాన్. ఈ టాప్ స్పిన్నర్ మొత్తం 11 సార్లు సున్నా పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్: ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ ప్రస్తుతం RCB తరపున ఆడుతున్నాడు. అతను మొత్తం 12 సార్లు డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.