
కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ (సన్నని సూజీ రవ్వ) 1 కప్పు, పాలు 2 కప్పులు (రవ్వ నానబెట్టడానికి 1 కప్పు, రబ్రీ కోసం 1 కప్పు), చక్కెర 1 కప్పు (పొడి చేసినది), మిల్క్ పౌడర్ 4 టేబుల్ స్పూన్లు (రవ్వ పిండిలో 2 టేబుల్ స్పూన్లు, పాలలో 2 ప్యాకెట్లు), వంట సోడా చిటికెడు, నెయ్యి కొద్దిగా, ఎల్లో ఫుడ్ కలర్ లేదా కస్టర్డ్ పౌడర్ కొద్దిగా (ఐచ్ఛికం), డ్రై ఫ్రూట్స్ తరుగు గార్నిష్ కోసం, నీళ్లు సరిపడా.

ముందుగా మిక్సీ జార్‌లో కప్పు చక్కెర వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కప్పు పాలు, కప్పు నీళ్లు పోసి, అందులో రెండు చిన్న ప్యాకెట్ల మిల్క్ పౌడర్, గ్రైండ్ చేసుకున్న చక్కెర పొడి (రెండు టేబుల్ స్పూన్లు పక్కన ఉంచి మిగిలినది) వేసి ఉండలు లేకుండా బాగా కలిపి సిద్ధం చేసుకోవాలి.

తర్వాత మరో గిన్నెలో కప్పు సన్నని బొంబాయి రవ్వ తీసుకుని, కప్పు పాలు పోసి కలపాలి. రవ్వ లావుగా ఉంటే ఒక్కసారి మిక్సీ పట్టి వాడుకుంటే స్వీట్ మరింత మృదువుగా వస్తుంది. రవ్వ పాలను పీల్చుకుని గట్టిపడుతుంది కాబట్టి, కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలిపి మూతపెట్టి పక్కన ఉంచాలి.

రవ్వ చక్కగా నానిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, పక్కన ఉంచిన చక్కెర పొడి, చిటికెడు వంట సోడా, కొద్దిగా నీళ్లు పోసి దోశ పిండిలా మృదువుగా కలుపుకోవాలి.ఇప్పుడు నాలుగు చిన్న గిన్నెలకు లోపల నెయ్యి రాసి, సిద్ధం చేసుకున్న రవ్వ పిండిని సమానంగా పోయాలి.స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి, అడుగున నీళ్లు పోసి, ఆ గిన్నెలను లోపల ఉంచి మూతపెట్టి ఆవిరిపై ఉడికించాలి. టూత్‌పిక్‌తో గుచ్చి చూస్తే పిండి అంటుకోకుండా ఉంటే చక్కగా ఉడికినట్లే. వీటిని బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ లోపు స్టవ్ మీద కడాయి పెట్టి ముందుగా కలిపి ఉంచుకున్న మిల్క్ పౌడర్ పాలను పోసి మరిగించాలి.

పాలు చిక్కబడి మీగడ కడుతున్న సమయంలో కొద్దిగా కస్టర్డ్ పౌడర్ లేదా ఫుడ్ కలర్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన రవ్వ కేకులను గిన్నెల నుండి వేరు చేసి, ఈ గోరువెచ్చని పాలలో వేసి కదిలిస్తూ నాననివ్వాలి. పాలను లోపలి వరకు పీల్చుకుని ఎంతో మృదువుగా మారిన ఈ స్వీట్‌ను ఫ్రిజ్‌లో ఉంచి, పైన డ్రై ఫ్రూట్స్ చల్లి చల్లచల్లగా వడ్డిస్తే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు