దేశంలోనే ఏకైక హార్ట్ షేప్ సరస్సు.. ఇంతటి అందం.. దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందో తెలుసా?

Updated on: May 18, 2026 | 4:56 PM

భారతదేశంలో ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కానీ, ప్రకృతి సిద్ధంగా హృదయాకారంలో (Heart Shape) ఏర్పడిన ఒకే ఒక్క అద్భుతమైన సరస్సు మన దక్షిణ భారతదేశంలో ఉందన్న విషయం మీకు తెలుసా? సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ లవ్ లేక్ లేదా హార్ట్ షేప్ సరస్సు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎంతటి కఠినమైన వేసవిలోనైనా ఈ సరస్సులోని నీరు అస్సలు ఎండిపోకపోవడం ఇక్కడి ప్రత్యేకత. ట్రెక్కింగ్ ప్రేమికులను, ప్రకృతి ఆరాధకులను విశేషంగా ఆకర్షించే ఈ అరుదైన సరస్సు విశేషాలు, అక్కడికి ఎలా చేరుకోవాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

1 / 5
ప్రకృతి తన అందాలతో మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన ప్రకృతి సృష్టి మన దేశంలోనే ఉంది. సాధారణంగా కృత్రిమంగా హృదయాకారంలో పార్కులు, సరస్సులు నిర్మించడం మనం చూస్తుంటాం. కానీ, ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా, ప్రకృతి సిద్ధంగానే పక్కా హార్ట్ షేప్ (హృదయాకారం) లో ఏర్పడిన ఏకైక సరస్సు మన దేశంలోనే ఉంది. పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే ఈ సరస్సును హార్ట్ షేప్ లేక్ లేదా ఎరోస్ లేక్ అని పిలుస్తారు.

2 / 5
ఎక్కడ ఉంది? దీని ప్రత్యేకత ఏంటి?: ఈ అద్భుతమైన సరస్సు కేరళలోని ప్రసిద్ధ హిల్ స్టేషన్ అయిన వయనాడ్ జిల్లాలోని చెంబ్రా పీక్ (Chembra Peak) పై ఉంది. చెంబ్రా పీక్ అనేది వయనాడ్ లోనే అత్యంత ఎత్తైన శిఖరం. సముద్ర మట్టానికి దాదాపు 6,900 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిఖరంపైకి చేరుకునే దారిలో, దాదాపు సగం దూరం వెళ్లాక ఈ హృదయాకార సరస్సు మనకు దర్శనమిస్తుంది. దట్టమైన పొగమంచు, పచ్చని కొండల మధ్య మెరిసిపోయే ఈ లవ్ లేక్ వీక్షణ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

3 / 5
ఎండకాలంలోనూ ఎండిపోని నీరు: ఈ సరస్సుకు సంబంధించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడి నీరు ఎప్పటికీ ఎండిపోదు. ఎంతటి కఠినమైన వేసవి కాలం వచ్చినప్పటికీ, ఈ హార్ట్ షేప్ సరస్సు నిండుగా, స్వచ్ఛమైన నీటితో కళకళలాడుతూనే ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు, ముఖ్యంగా నూతన వధూవరులు (కపుల్స్) ఎంతో ఆసక్తి చూపుతారు.

4 / 5
ట్రెక్కింగ్ ప్రియులకు స్వర్గధామం: చెంబ్రా పీక్, ఈ హార్ట్ షేప్ సరస్సుకు చేరుకోవడానికి అటవీ శాఖ అనుమతితో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. పచ్చని తేయాకు తోటలు, దట్టమైన అడవుల గుండా సాగే ఈ ట్రెక్కింగ్ అడ్వెంచర్ ప్రేమికులకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది.

5 / 5
ఎలా చేరుకోవాలి?: ఈ ప్రదేశానికి వెళ్లాలనుకునే వారు మొదట కేరళలోని వయనాడ్‌కు చేరుకోవాలి. వయనాడ్ ముఖ్య కేంద్రమైన కల్పెట్టా నుండి చెంబ్రా పీక్ బేస్ క్యాంప్ కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుండి అటవీ శాఖ అధికారుల అనుమతి పత్రం (పాస్) తీసుకుని ట్రెక్కింగ్ ప్రారంభించవచ్చు. నిత్యం బిజీగా ఉండే యాంత్రిక జీవనం నుండి కాస్త ఉపశమనం పొందడానికి, ఈ అరుదైన ప్రకృతి అద్భుతాన్ని సందర్శించడం ఒక మంచి ఆప్షన్.

Follow Us