Independence Day: ఇలా ముగ్గులు వేస్తే చాలు.. చూసే వారు జై హింద్ అనాల్సిందే!

Updated on: Aug 14, 2026 | 11:21 AM

స్వాతంత్ర్య దినోత్సవం వచ్చేసింది. ప్రతి భారతీయుడికి ఇష్టమైన ప్రత్యేకమైన రోజు ఆగస్టు 15. ఎంతో మంది త్యాగాల తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. ఇప్పటికీ ఇండియాకు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు. అందువలన ఈ సంవత్సరం ఘనంగా భారత దేశంలోని ప్రతి పల్లె పట్నంలో ప్రతి చోట మువ్వన్నెల జెండా ఎగరవేసి వేడుకలను జరుపుకుంటారు.

1 / 5
అయితే ఈ వేడుకలకు వారం రోజుల నుంచే ఏర్పాట్లు చేస్తుంటారు. ఆఫీసు లేదా పాఠశాల, కార్యాలయాలను అందంగా అలంకరిస్తారు. ముఖ్యంగా రంగు రంగుల ముగ్గులతో అందరినీ ఆకట్టుకుంటారు. అయితే ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో కాస్త కొత్తగా ఈ రంగు రంగుల డిజైన్స్ వేస్తే చాలు వచ్చిన వారు వాటిని చూస్తే జై హింద్ అనాల్సిందేనంట. కాగా, ఆ డిజైన్స్ ఏవో ఇప్పుడు చూసేద్దాం.

2 / 5
స్వాతంత్ర్య దినోత్సవం రోజున రంగు రంగులు కాకుండా కేవలం మూడు రంగులతో ముగ్గులు వేయడం చాలా అద్భుతంగా ఉంటుంది.  అయితే మీరు అద్భుతంగా కనిపించేలా ముగ్గు వేయాలి అనుకుంటే, దాని కోసం ముందుగా అశోక చక్రాన్ని గీయాలి. తర్వాత చుట్టూ మూడు రంగుల జెండా కలర్స్ వేయాలి. తర్వాత చుట్టూ వైట్ కలర్‌తో డెకరేట్ చేయాలి.

3 / 5
అశోకచక్రన్నీ పెట్టి. దాని తర్వాత తెలుపు రంగు , దాని తర్వాత కాషాయం, కింద పచ్చ రంగు వేయాలి. తర్వాత చిన్న చిన్నగా తెలుపు రంగు చుక్కలు పెద్దగా పెట్టాలి. ఆ తర్వాత మూడు రంగుల కలిసేలా ఆకులు, పువ్వుల మాదిరిగా ముగ్గు వేయాలి. ఇది చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

4 / 5
భారత దేశపటంతో రంగోలి వేస్తే ఎవరికైనా సరే దానిని చూస్తే జై హింద్ అనాలి అనిపిస్తుంది. దీని కోసం మీరు ముందుగా తెల్ల రంగు ముగ్గుతో పటం గీయాలి. తర్వాత మధ్యలో అశోక చక్రం గీసి, పైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పటాన్ని నింపాలి. తర్వాత చుట్టూ ఒక పెద్ద సర్కిల్ గీసి, పూలతో అందంగా మూడు రంగులతో అలంకరించాలి.

5 / 5
పువ్వులతో జెండా రంగులు వేసి, అందంగా అలంకరిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. దీని కోసం తెలుపు రంగు పూలు, చామంతి, మల్లె వంటి వాటిని తీసుకోవాలి. అలాగే కాషాయం రంగు బంతిపూలు తీసుకోవాలి. అదే విధంగా మాచి పత్రి ఆకు తీసుకోవాలి. ఇక ముందుగా చుట్టూ బంతి పూలతో సర్కిల్ చేయాలి. తర్వాత అందులో కాషాయం రంగు బంతి పూల రెక్కలతో నిపాలి. తర్వాత తెలుపు రంగుల పూల, గ్రీన్ కలర్ ఆకులు వేసి సర్కిల్ ఫిల్ చేయాలి. పైన అశోక చక్రం పెట్టాలి. తర్వాత పూలు, ఆకులతో అలంకరించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us