Hair Loss Control: ఏం వాడినా ఫలితం లేదా.. ఇది ట్రై చేయండి ఊడిన జుట్టు కూడా మళ్లీ రావచ్చు!

Updated on: Jul 26, 2026 | 5:19 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో జట్టు రాలడం కూడా ఒకటి. మానసిక ఒత్తిడి, కాలుష్యం, ఆహారపుల అలావాట్ల కారణంగా చాలా మంది చిన్న వయస్సులోనే జుట్టును కోల్పోతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు జనాలు మార్కెట్‌లో దొరికే అనేక రకాల రసాయన నూనెలు, మెడిసిన్స్ వాడుతున్నారు. కానీ మన ఇంటి పరిసరాల్లో దొరికే కొన్ని వస్తువులతోనే జుట్టు రాలే సమస్యను దూరం చేయడంతో పాటు జుట్టు పెరుగుదలను పెంచుకోవచ్చని చాలా మందికి తెలియదు. కాబట్టి ఆ వస్తువులు ఏంటి వాటిని ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
మెంతులు: జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలను పెంచడంలో మెంతులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలో ఐరన్, ప్రొటీన్, అనేక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. స్కాల్ప్ ని ఆరోగ్యంగా ఉంచి, జుట్టు వేగంగా పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తాయి.

2 / 5
రోజ్మేరీ: ఇది కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది స్కాల్ప్‌లో రక్తప్రసరణను మెరుగుపరిచి, వెంట్రుకల కుదుళ్లకు తగిన పోషణ అందిస్తుంది. కాబట్టి దీన్ని జుట్టుకు ఎలా వాడాలి అనే విషయానికి వస్తే.. మెంతులతో పాటు కొన్ని తాజా లేదా ఎండిన రోజ్మేరీ ఆకులను నీటిలో బాగా మరిగించి, చల్లారాక వడకట్టి జుట్టుకు పట్టించండి. అలాగే మీరు మెంతు నీటిలో లవంగాలు, కరివేపాకు, అలోవేరా జెల్‌ను కూడా సపరేట్‌, సపరేట్‌గా మరిగించి వాడుకోవచ్చు.

3 / 5
ఎలా వాడాలి: మీరు మెంతులతో కరివేపాకు, లవంగాలు, రోజ్మెరీ వంటి పదార్థాలతో తయారు చేసిన నీటిని వాడేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తలస్నానం చేయడానికి 20 నుండి 30 నిమిషాల ముందు కుదుళ్ల నుండి జుట్టు చివర్ల వరకు బాగా పట్టించాలి. తర్వాత 5 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి..ఆ తర్వాత సాధారణ నీటితో తలరుద్దుకుని, మైల్డ్ షాంపూతో స్నానం చేయాలి. ఇలా వారానికి 1 నుండి 2 సార్లు చేయడం వల్ల తక్కువ రోజుల్లోనే మీ జుట్టు రాలడం తగ్గి జట్టు ఒత్తుగా పెరుగుతుంది.

4 / 5
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: అయితే ఒక్కొక్కరి చర్మ తత్వం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ఏదైనా సహజ చిట్కాను పాటించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ మిశ్రమం వాడినప్పుడు దురద, మంట లేదా అలర్జీ అనిపిస్తే వెంటనే వాడటం ఆపేయండి. జుట్టు విపరీతంగా రాలుతున్నా లేదా స్కాల్ప్‌కి సంబంధించి తీవ్రమైన సమస్యలు ఉన్నా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

5 / 5
అయితే మెంతులు, రోజ్మేరీ, లవంగాలు, కరివేపాకు, అలోవెరా వంటివి జుట్టు సంరక్షణకు సహాయపడతాయి తప్ప, ఇవి రాత్రికి రాత్రే కొత్త జుట్టును మొలిపించలేవు. మెరుగైన ఫలితాల కోసం సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, ఒత్తిడి లేకపోవడం, సరైన హెయిర్ కేర్ రొటీన్ పాటించడం చాలా ముఖ్యం.Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు.

Follow Us